సొంత ఇంటి నిర్మాణం లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం చాలామంది బ్యాంకుల నుంచి హోం లోన్ తీసుకుంటూ ఉంటారు. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండటంతో పాటు మీ ఆస్తులను తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే హోం లోన్‌ను బ్యాంకులు మంజూరు చేస్తాయి. హోమ్ లోన్ చెల్లించేందుకు 20 ఏళ్ల వరకు సమయం పడుతుంది. ఈ కాలపరిమితిలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది..? ఎవరు కట్టాల్సి ఉంటుంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ లోన్ మాఫీ అవుతుందని, ఎవరూ కట్టాల్సిన పని ఉండదని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే అది పూర్తిగా తప్పు. ఇద్దరు కలిసి లోన్ తీసుకుని ఒకరి చనిపోతే కో అప్లికేంట్ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకింగ్ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి.
అయితే హోం లోన్ గ్యారంటర్కు కూడా సమానమైన హక్కు ఉంటుంది. అలాగే ఇన్యూరెన్స్ సౌకర్యం ఉంటే.. ఆ కంపెనీ నుంచి బ్యాంకులు వసూలు చేస్తాయి. రికవరీ చేసేందుకు బ్యాంకులు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. కో బారోవర్, గ్యారంటర్,లోన్ ఇన్యూరెన్స్ అంశాలను పరిశీలిస్తుంది.
లోన్ ప్రొటెక్షన్ పాలసీ ఉన్నప్పుడు పాలసీ నిబంధనల ప్రకారం బీమా సంస్థ నుంచి బ్యాంకులు వసూలు చేస్తాయి. ఇలాంటి సమయంలో కోఅప్లికేంట్, గ్యారంటీర్ కట్టాల్సిన పని ఉండదు. ఈ మేరకు బ్యాంకింగ్ నిబంధనలు తెలుపుతున్నాయి. బీమా సంస్థ మిగిలిన మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది.
హోం లోన్ ఇటీవల ఎక్కువమంది తీసుకుంటారు. సొంతింటి నిర్మాణం లేదా ఫ్లాట్ కొనుగోలుకు ఎక్కువ ఖర్చు అవుతుంది. పొదుపు చేసుకున్న డబ్బులు సరిపోకపోవడంతో బ్యాంకుల నుంచి హోం లోన్లు తీసుకుంటున్నారు. బ్యాంకులు కూడా వీటిని మంజూరు చేసేందుకు ముందుకొస్తున్నాయి




