Reading Time: 2 minutes
Business Ideas: ఫుడ్ బిజినెస్‌ స్టార్ట్ చేయాలా? కేంద్రం నుంచి 35% సబ్సిడీ.. ఇలా అప్లై చేస్తే రూ.10 లక్షల వరకు ప్రయోజనం

Business Ideas: మీరు మీ సొంత వ్యాపారాన్ని, ముఖ్యంగా ఆహార ప్రాసెసింగ్‌కు సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించాలని కలలు కంటున్నట్లయితే, ఒక ప్రత్యేక కేంద్ర ప్రభుత్వ పథకం మీకు చాలా సహాయకరంగా ఉంటుంది. అయితే మీరు కొత్తగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదా ఉన్న బిజినెస్‌ను మరింత విస్తరించాలనుకుంటున్నారా? ఇది మీకు బెస్ట్‌ ఆప్షన్‌. MSME పథకం కింద ఫుడ్ బిజినెస్, కేటరింగ్ లేదా ప్రాసెసింగ్ రంగంలో ఉన్నవారికి రూ. 10 లక్షల వరకు సబ్సిడీ లోన్స్ లభిస్తున్నాయి. అంతేకాదు, ఇందులో ఏకంగా 35% వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది.

ఈ లోన్ పొందడానికి సరైన బిజినెస్ ప్లాన్, GST, ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధం చేసుకుంటే ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. పన్నులు తగ్గించుకోవడమే కాకుండా ఆర్థికంగా స్థిరపడటానికి ఇది ఒక గొప్ప అవకాశం.

ఇది కూడా చదవండి: Personal Finance: జీతం పెరిగినప్పుడు చాలా మంది చేసే 5 ప్రధాన పొరపాట్లు ఏంటో తెలుసా..?

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో PMFME పథకం ఫుడ్ బిజినెస్ చేసేవారికి భారీ ఆర్థిక సబ్సిడీ లభిస్తోంది. కొత్తగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకునే వారికి ఈ స్కీమ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

అర్హతలు, సబ్సిడీ వివరాలు

ప్రాజెక్ట్ ఖర్చుపై 35% వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. గరిష్టంగా రూ. 10 లక్షల వరకు క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ ఉంటుందని తెలుస్తోంది.. దరఖాస్తుదారుడు ప్రాజెక్ట్ విలువలో కేవలం 10% మాత్రమే సొంతంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన 90% మొత్తాన్ని బ్యాంకులు రుణంగా మంజూరు చేస్తాయి.

18 ఏళ్లు పైబడిన వ్యక్తులు, కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టేవారు. మహిళా స్వయం సహాయక బృందాలు (SHGs), రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs) ఈ సబ్సిడీకి అర్హులు. మీరు ఏదైనా ఫుడ్‌ బిజినెస్‌ చేయాలనుకునేవారికి

వివిధ రకాల ఫుడ్‌ ప్రాసెస్‌ యూనిట్లు, పికిల్స్‌, బేకరీలు, మిల్లెట్స్ అండ్ స్నాక్స్ తయారీ, మసాలా పొడుల తయారీ, డెయిరీ ఉత్పత్తులు, పండ్ల రసాలు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇలా ఎన్నో ఉన్నాయి.

ఈ పథకం ప్రయోజనాలను ఎవరు పొందవవచ్చు:

ఇప్పటికే చిన్న ఆహార ప్రాసెసింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ, దానిని విస్తరించాలనుకుంటున్న వ్యక్తిగత పారిశ్రామికవేత్తలకు, అలాగే ప్రభుత్వ ‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’ చొరవ కింద తమ సొంత వ్యాపారాలను ప్రారంభించాలనుకుంటున్న కొత్త పారిశ్రామికవేత్తలకు ఈ పథకం అందుబాటులో ఉంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు), స్వయం సహాయక బృందాలు (SHGలు), సహకార సంఘాలు కూడా ఈ ఆర్థిక ప్రయోజనానికి అర్హులు.

దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన పత్రాలు:

1. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి, దరఖాస్తుదారులు అధికారిక PMFME ఆన్‌లైన్ పోర్టల్ (pmfme.mofpi.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

2. దరఖాస్తు చేసేటప్పుడు మీరు మీ వ్యాపారం పూర్తి ప్రాజెక్ట్ నివేదిక (DPR), పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించాలి. రుణం ఆమోదం పొందిన తర్వాత, ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా మీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తుంది.

ఇది కూడా చదవండి: MG EV: సింగిల్‌ ఛార్జింగ్‌తో 550 కిలోమీటర్ల రేంజ్.. పవర్‌ఫుల్‌ 7 సీటర్‌ కారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి