Reading Time: < 1 minute

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్.. డైవర్షన్ రోడ్లకు రూ.25 కోట్లు రిలీజ్

Caption of Image.

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో కీలక అడుగు పడింది. రెండు రోడ్ల డైవర్షన్ కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్  రన్ వే విస్తరణ, భూసేకరణ నేపథ్యంలో దారి మళ్లించాల్సిన రెండు ప్రధాన రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసింది. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కుమురంభీం ఎక్స్ రోడ్  నుంచి గాంధీ పార్క్, ఇందిరమ్మ కాలనీ మీదుగా బంగారిగూడ వరకు రోడ్  డైవర్షన్  చేయనున్నారు.

తిర్పెల్లి శ్మశాన వాటిక నుంచి లాండసాంగ్వి వరకు 2 కిలోమీటర్ల మేర ఔటర్  నేషనల్  హైవే డైవర్షన్  రోడ్  నిర్మించనున్నారు. ఈ రెండు రోడ్లు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్  బౌండరీ వల్ల మూసుకుపోతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయంగా రోడ్లు నిర్మిస్తున్నారు. జిల్లా కేంద్రానికి వచ్చే అనుకుంట రోడ్డు భూసేకరణలో తీసుకోనుండగా, దాదాపు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోనున్నాయి. దీంతో ఈ గ్రామాలకు బంగారుగూడ, కచ్ కంటి మీదుగా ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వచ్చేందుకు ప్రత్యామ్నాయంగా రోడ్డు నిర్మించనున్నారు.

160.32 ఎకరాలకు తొలి నోటిఫికేషన్
ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు కోసం భూ సేకరణ సర్వే ప్రక్రియ స్పీడప్​ చేశారు. 2 వేల ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సి ఉండగా.. తొలి విడతగా ఆదిలాబాద్  రూరల్  మండలం అర్లి(బి)లో 160.32 ఎకరాల సేకరణకు రెవెన్యూ శాఖ ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. సర్వే నెంబర్ 12లో 58 మంది రైతులకు సంబంధించిన భూమిని సేకరించనున్నారు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా 60 రోజుల్లో ఆర్డీవో ఆఫీసులో అందజేయాలని అధికారులు సూచించారు. అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం మరో నోటిఫికేషన్  జారీ చేసి నష్ట పరిహారం ప్రకటించనున్నారు. 

రూరల్  మండలంలోని కచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కంటి, టాక్లీ ప్రాంతాల్లోని భూముల సేకరణకు త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామసభలు నిర్వహించి పరిహారం విషయంలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. భూ సేకరణ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్  రాజర్షి షా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.