
‘ఇరుముడి’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన మాస్ మహారాజా రవితేజ, ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేశారు. ఈసారి ఏకంగా పండుగ బరిలో దిగి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో థియేటర్లను షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్లు దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో రవితేజ 64వ ప్రాజెక్ట్ (#SVC64) ఖరారైంది. వైవిధ్యమైన కథాంశాలతో మెప్పించే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి ఈ ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కించనున్నారు. పక్కా కమర్షియల్ హంగులతో, ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని పంచేలా ఒక రిఫ్రెషింగ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమాను 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం లాక్ చేసింది. ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్ తో పాటు రిలీజ్ చేసిన ట్యాగ్ లైన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. “దాగుడు మూతలు దండాకోర్.. ఎంటర్టైన్మెంట్ హార్డ్ కోర్” అనే క్యాచీ క్యాప్షన్ తో ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. దీన్ని బట్టి చూస్తే, ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు రవితేజ వింటేజ్ కామెడీ టైమింగ్ కూడా పీక్స్ లో ఉండబోతోందని స్పష్టమవుతోంది. సంక్రాంతి పండుగకు కావలసిన వినోదాల విందు ఈ చిత్రంలో పుష్కలంగా ఉండనుందనే భరోసాను మేకర్స్ ఇచ్చారు.
ఇటీవలే ‘ఇరుముడి’ చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన రవితేజ.. అదే ఊపులో దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత, హసిత్ గోలి లాంటి ప్రామిసింగ్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమాను సెట్ చేయడం అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తానికి 2027 సంక్రాంతి రేసులో మాస్ మహారాజా రాకతో బాక్సాఫీస్ వద్ద అసలైన పండుగ వాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది! అన్నట్టు ఈ సినిమాకి వీరాధివీరులంట టైటిల్ పరిశీలిస్తున్నారు.