Reading Time: < 1 minute
Whatsapp New Account Password Two Step Verification Security Feature

WhatsApp New Security Feature: వాట్సాప్ వాడే కోట్లాది మంది వినియోగదారుల కోసం సంస్థ మరో కీలకమైన సెక్యూరిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటివరకు ఖాతా భద్రత కోసం వాడుతున్న టూ-స్టెప్ వెరిఫికేషన్‌ విధానాన్ని మరింత పటిష్టం చేస్తూ ‘అకౌంట్ పాస్‌వర్డ్ ఫర్ టూ-స్టెప్ వెరిఫికేషన్’ అనే కొత్త ఫీచర్‌ను జోడించింది. వాట్సాప్ అప్‌డేట్స్‌ను నిశితంగా గమనించే ‘Wabetainfo’ ప్రకారం, ఈ కొత్త పాస్‌వర్డ్ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు టూ-స్టెప్ వెరిఫికేషన్‌లో 6 అంకెల పిన్ (PIN) మాత్రమే వాడేవాళ్ళం. కానీ కొత్త అప్‌డేట్‌తో కేవలం అంకెలకే పరిమితం కాకుండా, ఒక బలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. దీనివల్ల ఖాతాకు అదనపు రక్షణ లభించి హ్యాకింగ్ ముప్పు తగ్గుతుంది. SMS ద్వారా వచ్చే 6 అంకెల కోడ్‌ను నమోదు చేసిన తర్వాత, ఈ కొత్త పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఈ సెక్యూరిటీని యాక్టివేట్ చేసుకోవడానికి వాట్సాప్‌లోని Settings లోకి వెళ్లి, Account విభాగంలోకి వెళ్తే ‘అకౌంట్ పాస్‌వర్డ్’ సెట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పటికే టూ-స్టెప్ వెరిఫికేషన్ ఉపయోగిస్తున్న వారు ఈ ఫీచర్ రాగానే తమ పాత PIN స్థానంలో కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాల్సి రావచ్చు. అయితే ఈ పాస్‌వర్డ్ సెట్ చేసుకోవడానికి వాట్సాప్ ఒక ముఖ్యమైన నిబంధన పెట్టింది. సాధారణ పిన్ నంబర్లలా కాకుండా, ఖాతాదారులు కనీసం 8 అక్షరాలు (క్యారెక్టర్లు) ఉండేలా ఒక స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను డిజైన్ చేసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా ఈ పాస్‌వర్డ్ మరచిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఇమెయిల్ ఐడీ సహాయంతో సులభంగా రీసెట్ చేసుకోవచ్చు. మీరు రీసెట్ ఆప్షన్ ఎంచుకోగానే ఇమెయిల్‌కు ఒక లింక్ వస్తుంది, దాని ద్వారా కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.