Reading Time: < 1 minute

నేపాల్ లో చిక్కుకున్న.. మనవాళ్లను సేఫ్ గా తీసుకురండి: రాహుల్ గాంధీ

Caption of Image.

నేపాల్ లో సంభవించిన వరదలపై  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేపాల్ లో చిక్కుకున్న భారతీయులను సేఫ్ స్వదేశానికి వచ్చేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని  కోరారు.  బుధవారం (ఆగస్టు26) నేపాల్ లో వరదలు సంభవించి భారతీయ యాత్రికులతో సహా వందలాది గల్లంతయ్యారు. ప్రాణాలు కోల్పోయిన భారతీయుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రాహుల్. భారతీయ యాత్రికులను గుర్తించి స్వదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. 

సోషల్ మీడియా X లో స్పందించిన రాహుల్‌ గాంధీ.. నేపాల్‌ అధికారులతో సమన్వయం చేసుకొని గల్లంతైన భారతీయ పౌరులను గుర్తించి, సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషాద మసయంలో నేపాల్‌ ప్రజలకు, బాధితులందరికీ సంఘీభావం తెలిపారు రాహుల్. 

©️ VIL Media Pvt Ltd.