
NTR Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’. ఈ చిత్రంపై రోజుకో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తారక్ కోలుకునే వరకు షూటింగ్‌ను ఆపకుండా, ఆయన అవసరం లేని సన్నివేశాలను చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా సెప్టెంబర్ రెండో వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారట.
ఈ షెడ్యూల్‌లో ఇతర నటీనటుల కాంబినేషన్ సీన్స్‌తో పాటు కీలకమైన టాకీ పార్ట్స్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన షూటింగ్‌ను కొనసాగించనున్నారని టాక్. ఇక ‘డ్రాగన్’ విషయంలో ప్రశాంత్ నీల్ తన రెగ్యులర్ మేకింగ్ స్టైల్‌కు భిన్నంగా కనిపించనున్నారనే వార్త ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సాధారణంగా ఆయన సినిమాల్లో డార్క్ టోన్స్, బ్లాక్ అండ్ గ్రే షేడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ‘డ్రాగన్’ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను మాత్రం పూర్తిగా భిన్నమైన కలర్ ప్యాలెట్‌తో నీల్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు ఫుల్ కలర్‌ఫుల్‌గా, రిచ్ విజువల్స్‌తో సాగుతాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ఎపిసోడ్స్‌లో డార్క్ షేడ్స్‌కు పెద్దగా చోటు ఉండదని, జూనియర్ అభిమానులతో పాటు, సినిమా ప్రేక్షకులకు ప్రశాంత్ నీల్ సరికొత్త విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో ‘డ్రాగన్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.