Reading Time: < 1 minute

సమగ్ర శిక్షా పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు..ఆగస్టు 31 వరకు అప్లైకి చాన్స్ ఇచ్చిన విద్యాశాఖ

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్షా పరిధిలోని వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌‌‌‌లైన్ దరఖాస్తు గడువును స్కూల్ ఎడ్యుకేషన్ మరోసారి పొడిగించింది. స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీస్‌‌‌‌తో పాటు జిల్లా ప్రాజెక్ట్ ఆఫీస్‌‌‌‌ల పరిధిలో కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ కోఆర్డినేటర్లతో పాటు డీఈఓ కార్యాలయాల్లో డిస్ట్రిక్ట్ సైన్స్ కోఆర్డినేటర్ పోస్టుల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం దరఖాస్తు గడువు ముగియడంతో పలువురి అభ్యర్థన మేరకు ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. 

అయితే, ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 790 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని జిల్లాల్లో ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోకపోవడం, మరికొన్ని జిల్లాల్లో ఆశించిన స్థాయిలో అప్లికేషన్లు రాకపోవడంతో అధికారులు గడువును పొడిగించాలని నిర్ణయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లకు త్వరలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఆ పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే కోఆర్డినేటర్లను పారదర్శకంగా ఎంపిక చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. 

©️ VIL Media Pvt Ltd.