Reading Time: < 1 minute

అశ్విని రెడ్డి ‘కాక్‌టెయిల్ కౌచర్’లో పాయల్ రాజ్‌పుత్.. సైమా నామినేషన్ పార్టీ పిక్స్ వైరల్!

Caption of Image.

సైమా ( SAIMA ) నామినేషన్ పార్టీ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ‘RX 100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మెరిశారు.  ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అశ్విని రెడ్డి లెటస్ట్ ‘కాక్ టెయిల్ కౌచర్’ కలెక్షన్ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన డిజైనర్ వేర్ లో స్టేజిపై ర్యాంప్ వాక్ చేశారు. ఫ్లాష్‌లైట్ల కాంతులు మధ్య తన గ్లామరస్ లుక్ తో అందరి దృష్టి ఆకర్షించారు. 

ఈ ప్రత్యేకమైన ఔట్‌ఫిట్ ఆధునిక సిల్హౌట్, స్టేట్‌మెంట్ డీటెయిలింగ్‌తో అశ్విని రెడ్డి కౌచర్ శైలిని అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శించింది. బాడీ-కాన్ కట్‌లు, క్రిస్టల్ ఎంబ్రాయిడరీ, సూక్ష్మమైన సీక్విన్స్ మెరుపుల కలయికతో తయారైన ఈ దుస్తులు రాయల్ లుక్‌ను అందించాయి. పాయల్ తనదైన హొయలు, కాన్ఫిడెంట్ స్టైల్‌తో ఈ డిజైనర్ క్రియేషన్‌కు మరింత గ్లామర్‌ను జోడించి  ప్రసిద్ధ ‘ఫ్యాషన్ ఐకాన్’గా నిలిచారు.

మినిమలిస్టిక్ మేకప్, గ్లాసీ లిప్స్, స్మోకీ ఐస్‌తో పాయల్ ఇచ్చిన బోల్డ్ భంగిమలు కెమెరాలను కట్టిపడేసాయి. అశ్విని రెడ్డి లేటెస్ట్ ‘కాక్‌టెయిల్ కౌచర్’ కలెక్షన్ లగ్జరీకి, సొగసైన శైలికి సరికొత్త మార్గదర్శిగా నిలిచింది. పాయల్ రాజ్‌పుత్, అశ్విని రెడ్డిల కాంబినేషన్ ఈ ప్రైవేట్ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా మారి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ALSO READ : రవితేజ ‘ఇరుముడి’ కోసం థియేటర్‌ ముందు ధర్నా.. 

తోటి సెలబ్రిటీలతో పాటు ఫ్యాషన్ ప్రియులను కూడా ఈ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది.పాయల్ రాజ్‌పుత్, అశ్విని రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన ఈ ఫ్యాషన్ మూమెంట్ ప్రైవేట్ సైమా నామినేషన్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాయల్ రాజ్‌పుత్ తన కాన్ఫిడెంట్ స్టైల్‌తో ఈ డిజైనర్ క్రియేషన్‌కు మరింత గ్లామర్‌ను జోడించారు . రాబోయే పార్టీ సీజన్‌కి ఒక సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది.
 

©️ VIL Media Pvt Ltd.