Reading Time: < 1 minute

యువతకు నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక శిక్షణే లక్ష్యంగా జపాన్‌లో మంత్రి వివేక్ టూర్

Caption of Image.

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జపాన్ పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి తన టూర్‌ను కొనసాగిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన హిరోషిమా ప్రిఫెక్చర్ వైస్ గవర్నర్‌తో సమావేశమయ్యారు.ఈ భేటీలో ఇరు ప్రాంతాల మధ్య పారిశ్రామిక, సాంకేతిక సహకారాన్ని మరింత బలపరచడంపై ప్రధానంగా చర్చించారు. 

 రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక శిక్షణ అందించే అంశంపై విస్తృతంగా చర్చించారు. త్వరలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా హిరోషిమా ప్రతినిధులకు మంత్రి వివేక్ అధికారికంగా ఆహ్వానం పలికారు.పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.

 జపనీస్ భాషలో శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి జపాన్ సహకారం ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కేవలం సాంప్రదాయ రంగాలే కాకుండా, స్టార్టప్ రంగంలోనూ హిరోషిమాతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు.

©️ VIL Media Pvt Ltd.