
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. తద్వారా రవితేజ కెరీర్‌లోనే అత్యంత వేగంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిన చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచింది. ఈ నేపథ్యంలోనే సినిమాకు రోజరోజుకూ మౌత్ టాక్ రెట్టింపు అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటుగా సినీ స్టార్స్ సైతం సినిమాను థియేటర్లలో చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు.
‘ఇరుముడి’ చూసి ఫిదా అయిపోయా..
తాజాగా సినిమా చూసిన బ్యూటీ రష్మిక మందన్నా..‘ఇరుముడి’పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సినిమా తనను ఊహించని విధంగా కదిలించిందని రివ్యూ ఇస్తూ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించింది. ‘‘నిన్న ‘ఇరుముడి’ సినిమా చూసే అవకాశం వచ్చింది. ఎంత అందమైన సినిమా ఇది. నేను ఊహించని విధంగా ఈ సినిమా నన్ను కదిలించింది. సాధారణంగా చిన్న పట్టణాల్లో పెరిగినప్పుడు మనకు ఏదైనా జరిగినా, ఏదైనా ఇబ్బంది కలిగినా.. మనలోని అమాయకత్వంతో ముందుగా పెద్దలకు చెప్పాలని అనుకుంటాం. కానీ ఆ తర్వాత వాస్తవ పరిస్థితులు మనకు అర్థమవుతాయి. ఏం జరిగినా మౌనంగా ఉండాలని మనకు చెబుతారు.
అలాంటి విషయాన్ని మాట్లాడాల్సిన అవసరం ఉందని ఎంతో అద్భుతంగా చెప్పిన సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమా నాకు ఎంతో మంచి సర్‌ప్రైజ్. ఇలాంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినందుకు చిత్ర బృందానికి అభినందనలు’’ అని రష్మిక X వేదికగా పోస్ట్ చేసింది.
Yesterday I had the opportunity to watch Irumudi.. ❤️
What a beautiful film it is.. ❤️ it hit me in ways I didn’t see coming.. ❤️
Generally when we grow up in small towns something happens to us or something bothers us our first response will be to tell our elders what happened… pic.twitter.com/lyntnD3bm3— Rashmika Mandanna (@iamRashmika) August 25, 2026
రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణకు ప్రత్యేక అభినందనలు
రవితేజను ప్రత్యేకంగా అభినందించిన రష్మిక.. ఈ విజయంపై తాను ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. అలాగే సినిమాలో నక్షత్ర నటనను ప్రశంసిస్తూ.. ‘‘నువ్వు సినిమాలో సన్‌షైన్‌లా ఉన్నావు. నీ చిరునవ్వు నన్ను కూడా నవ్వించింది’’ అంటూ అభినందించింది. దర్శకుడు శివ నిర్వాణకు కూడా రష్మిక బెస్ట్ విషెస్ తెలిపింది.
‘‘ఈ సక్సెస్ కు మీరు పూర్తిగా అర్హులు. ఇలాంటి అందమైన సినిమాను తెరకెక్కించినందుకు ధన్యవాదాలు. మీ కథ, స్క్రీన్ ప్లే, మేకింగ్ కి ఫిదా అయ్యాను. ఇంత మంచి చిత్రం అందించిన మొత్తం చిత్ర బృందానికి అభినందనలు’’ అంటూ రష్మిక తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా, రష్మిక వంటి స్టార్ హీరోయిన్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు ‘ఇరుముడి’కి మరింత బూస్ట్ ఇచ్చినట్లయ్యాయి. విజయ్ దేవరకొండ సైతం ఎమోషనల్ పోస్ట్ చేస్తూ చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.
What a glorious atmosphere in the Telugu cinema halls ❤️❤️@RaviTeja_offl anna and my darling @ShivaNirvana have created a celebration across the Telugu states. #Irumudi is a must watch for the gripping storytelling and the message ❤️
Biggest celebratory hugs to Ravanna,…
— Vijay Deverakonda (@TheDeverakonda) August 25, 2026
ఐదో రోజుకూ హౌస్‌ఫుల్ బోర్డులు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లలో ఐదో రోజు కూడా హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వర్కింగ్ డేస్‌లోనూ ఈ స్థాయిలో డిమాండ్ కొనసాగుతుండటంతో సినిమా బాక్సాఫీస్ రన్‌పై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదే జోరు కొనసాగితే ‘ఇరుముడి’ మరిన్ని భారీ రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
3.8 మిలియన్లకు పైగా టికెట్ల విక్రయం
‘ఇరుముడి’ క్రేజ్‌ను టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌ల గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 3.8 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. వీకెండ్ పూర్తయి ఐదో రోజులోకి అడుగుపెట్టినా సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా కొనసాగుతున్నాయి.
HEART WINNING BLOCKBUSTER #Irumudi continues its dominance at the box office with an extraordinary Monday 💥
3.8 MILLION+ TICKETS SOLD on BookMyShow and District Apps alone in just 4 days 💥💥💥
Book Your Tickets Now!
🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/cCKnsogcET— Mythri Movie Makers (@MythriOfficial) August 25, 2026