వివాహం జరిగిన సంవత్సరం పాటు నూతన వధువు సింధూరం పెట్టుకునే సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే సింధూరం అనేది వైవాహిక జీవితం ఆనందానికి, అదృష్టానికి చిహ్నం అందువలన పెళ్లి తర్వాత సంవత్సరం పాటు, తలస్నానం చేసిన వెంటనే తడి జుట్టుపై సింధూరం పెట్టకూడదు. అలాగే పెళ్లిలో ఇచ్చిన సింధూరాన్నే వాడాలి. తర్వాత కొత్తది కొనుగోలు చేసి వాడాలంట. అంతే కాకుండా ప్రతి రోజు నుదుట కుంకుమ పెట్టుకొనే ఉండాలి.
అలాగే మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన పట్టు చీర, పెళ్లి చీరను జాగ్రత్తగా దాచుకోవాలి. ముఖ్యంగా వివాహం తర్వాత తల్లిదండ్రు నుంచి వచ్చిన చీర అదృష్టానికి చిహ్నం అంటారు. అందువలన అది మొదటి సంవత్సరంలోనేకాలిపోకుండా, చినిగి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు పండితులు.
వివాహం జరిగిన తర్వాత తమ వైవాహిక జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా సాగిపోవాలి అంటే తప్పకుండా ఒక సంవత్సరం పాటు జుట్టు కత్తిరించడం చేయకూడదంట. పెళ్లైన మొదటి సంవత్సరం జుట్టు కత్తిరించడం అనేది స్త్రీ అదృష్టం, సానుకూల శక్తితో ముడిపడి ఉంటుందంట. అందువలన ఎట్టి పరిస్థితుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు అని చెబుతున్నారు పండితులు.
అలాగే మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన పట్టు చీర, పెళ్లి చీరను జాగ్రత్తగా దాచుకోవాలి. ముఖ్యంగా వివాహం తర్వాత తల్లిదండ్రు నుంచి వచ్చిన చీర అదృష్టానికి చిహ్నం అంటారు. అందువలన అది మొదటి సంవత్సరంలోనేకాలిపోకుండా, చినిగి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా వివాహం జరిగిన మొదటి సంవత్సరంలో చేతి గాజులు తీయకుండా ఉండాలి.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




