
రాఖీ పండుగ వచ్చేస్తోంది. ఆ రోజు (ఆగస్టు 28) అక్కా చెల్లెళ్లు.. అన్న దమ్ములకు రాఖీ కడతారు. ఆ సమయంలో నీకు నేను భరోసా అని చెప్పిన సోదరులు బహుమానాలు ఇస్తారు. ఈ ఏడాది రాఖీ పండగకు చాలా విశిష్ట కూడా ఉంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మీ అక్క చెల్లెళ్ల రాశి ప్రకారం ఎవరికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
మేష రాశి : ఎరుపు రంగు దుస్తులు, ట్రావెల్ బ్యాగ్ , స్పోర్ట్స్ షూస్, ఫిట్‌నెస్ స్మార్ట్‌వాచ్ బహుమతిగా ఇస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
వృషభ రాశి : ఈ రాశి వారికి మంచి పెర్ఫ్యూమ్, వాలెట్, వాచ్, హ్యాండ్‌బ్యాగ్ , ప్రీమియం చాక్లెట్లు, వెండి ఆభరణాలు, నాణేలు, తెల్లని పట్టు వస్త్రాలు ఇవ్వడం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మిథున రాశి : వీరికి మంచి పుస్తకాలు, హెడ్‌ఫోన్స్, డైరీ, గ్యాడ్జెట్స్ వంటివి ఇవ్వడం వలన మనసుకు ఆనందం కలుగుతుంది
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్, వ్యక్తిగతంగా కస్టమైజేషన్ చేసిన బహుమతులు ఇస్తే బాగా ఇష్టపడతారు. వెండితో తయారు చేసిన వస్తువులను కూడా ఈ రాశి వారు బాగా ఇష్టపడతారు.
సింహ రాశి : వీరికి స్టైలిష్‌గా ఉండే వాచ్, సన్‌గ్లాసెస్, బ్రాండెడ్ పెర్ఫ్యూమ్స్ , జువెలరీ వంటివి రాఖీ పండుగ రోజు బహుమతిగా ఇవ్వడం వలన కెరీర్ లో ఎదురయ్యే అడ్డంకులు తొలగుతాయి.
కన్యా రాశి : ఈ రాశి వారికి ఆర్గనైజర్, ప్లానర్, బ్యాగ్, పుస్తకాలు అంటే చాలా ఇష్టంగా ఉంటారు.
తులా రాశి : ఈ రాశి వారికి జువెలరీ, ఫ్యాషన్ వాచ్, హోమ్ డెకరేషన్ వంటి వస్తువులు ఇస్తే చాలా సంతోషిస్తారు.
వృశ్చిక రాశి : వీరికి లెదర్ వాలెట్, పుస్తకాలను రాఖీ గిఫ్ట్ గా ఇవ్వాలి. పుస్తకాలంటే దేవుడి పుస్తకాలు.. ఇంకా దేవుడి చిత్ర పటాలు.. పూజా సామాగ్రి వంటివి ఇవ్వడం వలన జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు.
►ALSO READ | జ్యోతిష్యం : రాఖీ పౌర్ణమి రోజునే.. 7 గ్రహాలు..నక్షత్రాలు కలుస్తున్నాయా.. దీని వల్ల నష్టమా.. లాభమా.. !
ధనుస్సు రాశి : ఈ రాశి వారికి ట్రావెల్ బ్యాక్‌ప్యాక్, కెమెరా , ట్రావెల్ యాక్సెసరీస్, సెల్ ఫోన్ వంటివి నచ్చుతాయి.
మకర రాశి : వీరికి దీర్ఘకాలం ఉపయోగపడే స్టైలిష్ వాచ్‌లు, ఆఫీస్ బ్యాగ్, వాలెట్, లెదర్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు.
కుంభ రాశి : ఈ రాశికి చెందిన మహిళలు స్మార్ట్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ లైట్ బహుమతులు,ట్రెండీ గ్యాజెట్స్, మోడ్రన్ ఆర్ట్, లేటెస్ట్ డ్రస్ లు, ఇంకా అలంకారానికి ఉపయోగించే వస్తువులంటే చాలా ఇష్టపడతారు.
మీన రాశి : వీరు పెయింట్ బొమ్మలు, పుస్తకాలు, ఫోటో ఫ్రేమ్స్ , హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్‌ను చూసి ఆనందిస్తారు
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.