
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’ (TOXIC) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ‘KGF: 2’ విడుదలైన దాదాపు నాలుగేళ్ల తర్వాత యష్ నటించిన సినిమా థియేటర్లలోకి రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ (ఆగస్టు 26, 2026న) టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.
‘మూతోన్’ ఫేమ్ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్‌తో పాటు కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు మూడు గంటలకు పైగా రూపొందగా, 18 ఏళ్లు వయసున్న వారే చూడాలనే కండిషన్‌తో ‘A’ సర్టిఫికెట్తో విడుదలైంది.
‘టాక్సిక్’ కథేంటి?
కథ 1950ల నాటి గోవా నేపథ్యంలో సాగుతుంది. అప్పట్లో పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవాలో సముద్ర మార్గం ద్వారా జరిగే స్మగ్లింగ్, నేర సామ్రాజ్యాలు, గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు చుట్టూ కథ తిరుగుతుంది.
ఈ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన రాయా అనే వ్యక్తి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. అధికారం, డబ్బు, భయం.. ఇవే అతడి ప్రపంచానికి మూల స్తంభాలుగా మారతాయి. అయితే ఆ సామ్రాజ్యంలోకి కుటుంబ బంధాలు, ప్రేమ, నమ్మకద్రోహం, ప్రతీకారం ప్రవేశించడంతో రాయా జీవితం మరో మలుపు తిరుగుతుంది.
యష్ ఈ సినిమాలో ఒకే పాత్రలో కాకుండా డ్యూయల్ రోల్లో కనిపించడం కథలో ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తుంది. రాయా పాత్రతో పాటు అతడి కుమారుడు రూమి అలియాస్ ‘టికెట్’ పాత్రలోనూ యష్ కనిపిస్తారు.
ప్రీమియర్ టాక్ ఎలా ఉంది?
సినిమా విడుదలకు ముందే కొన్ని ప్రీమియర్ షోలు, ఎర్లీ స్క్రీనింగ్స్ చూసిన ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో రివ్యూస్ మొదలయ్యాయి. ఇప్పటివరకు వచ్చిన తొలి టాక్‌లో యష్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటిక్ స్కేల్‌కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కొందరు ప్రేక్షకులు యష్ పెర్ఫార్మెన్స్ను కెరీర్లో బెస్ట్ అని రివ్యూలు ఇస్తున్నారు.
అయితే, మూడు గంటలకు పైగా రన్‌టైమ్, మితిమీరిన వయెలెన్స్, పాత్రల గజిబిజి ఎక్కువ ఉండటంతో కొంతమంది ప్రేక్షకులకు మైనస్‌గా అనిపించినట్లు టాక్. అయినప్పటికీ.. యష్ తన ఫ్యాన్స్ కు మాత్రం సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్ అందించినట్లుగా ట్వీట్స్ పెడుతున్నారు.
యష్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
‘కేజీఎఫ్’లో రాఖీ భాయ్‌గా అదరగొట్టిన యష్.. ‘టాక్సిక్’లో మరోసారి డార్క్ గ్యాంగ్‌స్టర్ షేడ్స్‌లో కనిపించాడు. ముఖ్యంగా రాయా పాత్రలో అతడి బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయని తొలి టాక్ వినిపిస్తోంది.
అయితే ఈసారి యష్‌ను కేవలం మాస్ హీరోగా చూపించకుండా.. అతడి పాత్రలోని ఎమోషనల్ షేడ్స్, కుటుంబ సంబంధాలు, అంతర్గత సంఘర్షణలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
First Half : Story Building😍 Slow And Twisted Narration 🤯
Links for 2nd HalfSecond Half : Mass with Yash Double Action Fight
Yash vs Yash 🐉
Tabhahi Song 🔥💥Verdict : TOXIC BUSTER 🧨💣🤯#Toxic #Yash #ToxicReview
— Reddy (@ramidi_dheeraj) August 26, 2026
లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ మార్క్..
‘టాక్సిక్’లో గీతూ మోహన్‌దాస్ తనదైన డార్క్, రా ట్రీట్మెంట్ను తీసుకొచ్చినట్లు తొలి స్పందనలు సూచిస్తున్నాయి. సాధారణ కమర్షియల్ గ్యాంగ్‌స్టర్ కథకు భిన్నంగా.. క్రైమ్ ప్రపంచంలోని చీకటి కోణాలతో పాటు బంధాలు, నమ్మకం, ద్రోహం, అధికారం వంటి అంశాలను కథలో మేళవించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ట్రైలర్ నుంచే సినిమాపై ఎన్నో థియరీలు తెరపైకి వచ్చాయి. సినిమా కథను సింపుల్‌గా చెప్పకుండా.. ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా కథనాన్ని నిర్మించినట్లు ట్రైలర్‌పై వచ్చిన విశ్లేషణలు కూడా సూచించాయి
మిగతా నటీనటులు..
నయనతార ఈ సినిమాలో గంగా పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వానీ నదియాగా నటించగా.. రుక్మిణి వసంత్ మెలిస్సా అంతర్జాతీయ ఆయుధాల వ్యాపారి (Arms Dealer) పాత్రలో అదరగొట్టింది టాక్. ఇక తారా సుతారియా రెబెక్కా, హుమా ఖురేషీ ఎలిజబెత్ పాత్రల్లో కనిపించారు.
ఫైనల్‌గా..
‘టాక్సిక్’ సాధారణ మాస్ గ్యాంగ్‌స్టర్ సినిమా కాదని.. యష్ అభిమానులతో పాటు డార్క్, ఇంటెన్స్ కథలను ఇష్టపడే ప్రేక్షకులను టార్గెట్ చేసిన సినిమాగా కనిపిస్తోంది. యష్ పెర్ఫార్మెన్స్, యాక్షన్, BGM సినిమాకు ప్రధాన బలాలుగా నిలుస్తుండగా.. స్లో పేసింగ్, కాంప్లెక్స్ నేరేషన్, ఎక్కువ రన్‌టైమ్ కొంతమందికి మైనస్‌గా మారే అవకాశం ఉందని టాక్ వస్తుంది.
ఈ క్రమంలోనే సినిమా టెక్నీకల్‌గా బలంగా ఉన్నప్పటికీ.. గందరగోళమైన రచన, బలహీనమైన స్క్రీన్‌ప్లే, నెమ్మదిగా సాగే కథనం సినిమాకు మెయిన్ మైనస్లుగా మారాయని మరికొందరు ఆడియన్స్ రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా పాత్రల పరిచయం, డైలాగ్స్, ఎడిటింగ్ కూడా నిరాశపరిచాయని అంటున్నారు. అయితే యష్ స్క్రీన్ ప్రెజెన్స్, కొన్ని సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం సినిమాకు కాస్త ఊరటనిచ్చే అంశాలుగా పేర్కొంటున్నారు. మొత్తంగా ‘టాక్సిక్’ సినిమాకు మిక్సెడ్ టాక్ వినిపిస్తోంది.
#Toxic A Fairy Tale That Turns Into a Complete Nightmare for Everyone!
A technically sound film buried under chaotic writing and exhausting execution. There are barely any proper character introductions, the narrative has no clear flow, and the screenplay gets confusing enough…
— Venky Reviews (@venkyreviews) August 26, 2026
రన్‌టైమ్ & సెన్సార్:
సినిమా నిడివి 3 గంటల 12 నిమిషాలు. తీవ్రమైన యాక్షన్, డార్క్ షేడ్స్ ఉన్నందున CBFC ఈ సినిమాకు ‘A’ (Adults Only) సర్టిఫికేట్ ఇచ్చింది.
బడ్జెట్ & మేకింగ్:
దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో కన్నడ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి చిత్రీకరించి, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా రేంజ్లో భీబత్సం సృష్టిస్తుంది.