Reading Time: < 1 minute

హమ్మయ్యా.. మంగళవారం దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే?

Caption of Image.

అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఆందోళనలతో పాటు డాలర్ విలువ బేజారిపోవటంతో బులియన్ మార్కెట్లు బ్రేకులు లేకుండా దూసుకుపోతున్నాయి గడచిన 20 రోజులుగా. ఈ క్రమంలో శ్రావణమాసం షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెరిగిన రేట్లతో ఆందోళనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు రేట్లు తగ్గటం స్వల్ప ఊరటగా నిలుస్తోంది. కొనటానికి వెళ్లేముందు తమ నగరాల్లో తగ్గిన ధరలను పరిశీలించటం బెటర్. 

ఆగస్టు 25న బంగారం రేట్లు తగ్గాయి. ఆగస్టు 24 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.22 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 375గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.15వేల 010గా కొనసాగుతోంది. 

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 24, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.10వేలు తగ్గి రూ.2లక్షల 65వేలకు చేరింది. అంటే గ్రాము దాదాపు రూ.275 దగ్గర ఉంది.

©️ VIL Media Pvt Ltd.