IND vs SL 2nd Test: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకోవడంతో అంపైర్లు ఆగస్టు 24వ తేదీన నిర్ణీత సమయం కంటే ముందే టీ విరామాన్ని ప్రకటించారు. వర్షం ప్రారంభమయ్యే సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. వర్షం తీవ్రం కాకముందే గ్రౌండ్ స్టాఫ్ వేగంగా స్పందించి పిచ్‌తో పాటు అవుట్‌ఫీల్డ్‌ను కవర్లతో కప్పి ఉంచారు.
పంత్ అవుట్.. సెంచరీ దిశగా ధ్రువ్ జురెల్:
లంచ్ విరామం తర్వాత భారత్ 419/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించగా, శ్రీలంక బౌలర్లు వెంటనే వికెట్ సాధించారు. లంచ్ తర్వాత వేసిన మొదటి బంతికే కేశర నువాంత బౌలింగ్‌లో రిషభ్ పంత్ (63) మిడ్ ఆఫ్ దాటించే క్రమంలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మానవ్ సుతార్ కూడా త్వరగానే నిష్క్రమించాడు. అయితే మరొకవైపు ధ్రువ్ జురెల్ క్రీజులో నిలకడగా ఆడుతూ తన రెండో టెస్టు సెంచరీ దిశగా సాగుతున్నాడు. ప్రస్తుతం జురెల్‌కు తోడుగా మహమ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నాడు. 8 వికెట్లు కోల్పోయిన భారత్ ప్రస్తుతం 475 పరుగులు చేసింది.
ఆట ఎప్పుడు ప్రారంభమవుతుంది?
చినుకులుగా ప్రారంభమైన వర్షం ఒక్కసారిగా కుండపోతగా మారడంతో గ్రౌండ్ స్టాఫ్ మైదానాన్ని కవర్లతో కప్పివేశారు. టీ విరామం తర్వాత కూడా వర్షం తగ్గకపోవడంతో ఆట నిలిచిపోయింది. మధ్యలో కొంతసేపు వర్షం తగ్గినట్లే కనిపించినప్పటికీ, మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వడంతో కవర్లను అలాగే ఉంచారు. దీంతో ఆట తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

The covers are 🔛 as rain 🌧️ stops play in Colombo!

Early Tea has been taken.

Stay tuned for further updates!

Scorecard ▶️ https://t.co/r9FgXSdsMf#TeamIndia | #SLvIND pic.twitter.com/P1KE44B0uH
— BCCI (@BCCI) August 24, 2026