Reading Time: < 1 minute

నూకరాజు కుటుంబం కేసుపై సీబీఐ, NIA దర్యాప్తు జరపాలి: విజయసాయిరెడ్డి 

Caption of Image.

పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసుపై సీబీఐ లేదా NIA దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.  ఈ ఘటన వెనక పెద్ద కుట్ర ఉందని అన్నారు. సోమవారం ( ఆగస్టు 24 ) నూకరాజు కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు .సాదిక్ అనే వ్యక్తితో పాటు మరో తొమ్మిది మంది కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారని అన్నారు విజయసాయిరెడ్డి. 

సాదిక్ ఒక ఉగ్రవాద గ్రూప్ కి నాయకత్వం వహిస్తున్నట్లు తనకు సమాచారం ఉందని అన్నారు విజయసాయిరెడ్డి. కాకినాడ, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో మరో 15 కుటుంబాలు కూడా ఈ గ్రూప్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఉన్నాయని అన్నారు. అయితే.. పరువు సామజిక ప్రతిష్ట కారణంగా వారు వివరాలు చెప్పేందుకు ముందుకు రావడంలేదని అన్నారు.

సాదిక్, అతని గ్రూప్ కు అరబ్, కెనడా దేశాలతో సహా అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. మత మార్పిడి, తుపాకుల సప్లై, బెదిరింపులుఎం వసూళ్లు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యవహారం ఏపీకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు కూడా విస్తరించిందని అనుమానం ఉందని అన్నారు. 

విజయసాయిరెడ్డి డిమాండ్లు:

  • సాదిక్‌ కు షూటింగ్ స్కూల్ లైసెన్స్ ఇప్పించేందుకు రెకమండ్ చేసింది ఎవరు..?
  • షూటింగ్ స్కూల్‌లో ఎలాంటి కార్యకలాపాలు జరిగాయి..?
  • కొన్నేళ్ల క్రితం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి సాదిక్‌ కు ప్రస్తుతం కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి ? అతని ఆదాయ వనరులపై విచారణ జరగాలి
  • సంపాదించిన డబ్బును ఎక్కడ, ఎలా వినియోగించారు..?
  • దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఉన్న ఆరోపణల్లో వాస్తవం ఎంత..?

ఈ అంశాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి.

©️ VIL Media Pvt Ltd.