Reading Time: < 1 minute
Re Released Movies Are Hurting The Fans Of Star Heroes

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరోల పుట్టినరోజుల సందర్భంగా వింటేజ్ క్లాసిక్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలను థియేటర్లలో మళ్లీ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇటీవల రీ-రిలీజ్ కావలసిన కొన్ని ఐకానిక్ చిత్రాలు చివరి నిమిషంలో వాయిదా పడుతుండటం నందమూరి, అక్కినేని, మెగా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆయన కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ మాస్ ఎంటర్‌టైనర్ ముఠామేస్త్రీ చిత్రాన్ని రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని మళ్లీ పెద్ద తెరపై చూసి ఎంజాయ్ చేయాలని థియేటర్ల వద్ద హంగామా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే డిజిటల్ రీమాస్టరింగ్ పూర్తయిన తర్వాత ఫైనల్ అవుట్‌పుట్‌లో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తాయి. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఈ సినిమా రీ-రిలీజ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

కింగ్ నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన కల్ట్ లవ్ స్టోరీ గీతాంజలి సినిమాను రీ-రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అంటే నేటికీ ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమాకి కూడా సాంకేతిక లోపాలే అడ్డంకిగా మారాయి. 4K డిజిటల్ రీమాస్టరింగ్ పనుల్లో అవుట్‌పుట్‌లో లోపాలు రావడంతో ఆఖరి నిమిషంలో ‘గీతాంజలి’ రీ-రిలీజ్‌ను కూడా పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఎంతో ఆశగా ఎదురుచూసిన సినిమాలు సాంకేతిక కారణాల వల్ల రీ-రిలీజ్ కాకపోవడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా అప్‌సెట్ చేస్తోంది. ముందే అన్ని సాంకేతిక పనులను పూర్తి చేసుకుని ప్రకటనలు ఇస్తే బాగుంటుందని ఇలా చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం సరికాదని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.