Reading Time: 2 minutes
చిన్న పిల్లాడిలా సెట్‌లో అల్లరిచేసేవాడు.. ఇప్పుడు ఓ బ్రాండ్‌గా, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు

లేడీ సూపర్ స్టార్ నయనతార వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది. స్టార్ హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ, రెమ్యునరేషన్ తీసుకుంటూ రాణిస్తుంది. ఇక నయన్ తాజాగా టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యష్ హీరోగా నటించిన ఈ సినిమా నేడు ( గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నయన్ తన నటనతో కట్టిపడేసిందని అంటున్నారు చూసిన ఆడియన్స్. యాక్టింగ్ తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ ఆమె ఇరగదీసిందని అంటున్నారు ప్రేక్షకులు. నయన్ తెలుగు, తమిళ్ తోపాటు హిందీ సినిమాల్లోనూ రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో నయనతార ఓ స్టార్ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ టాలీవుడ్ హీరో గురించి ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Jabardasth Naresh: మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు నాకు ఇచ్చేది ఎంతంటే

ప్రేక్షకుల మనసుల్లో లేడీ సూపర్ స్టార్గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటి నయనతార ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాన్-ఇండియా స్టార్ ప్రభాస్‌తో తన స్నేహం గురించి, అలాగే  సినిమా సెట్ లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో చెప్పుకొచ్చింది నయనతార. ప్రభాస్‌ను తానెప్పుడు చూసినా, ఆయన తనతో కలిసి పనిచేసినప్పుడు చాలా సరదాగా ఉండేది, ఒక చిలిపి పిల్లవాడిలా కనిపించేవాడని నయనతార గుర్తుచేసుకున్నారు. “ప్రభాస్ చాలా స్వీట్. ఆయనో చిలిపి పిల్లవాడిలా ఉంటాడు. నేను ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఆయన అచ్చం చిన్న పిల్లాడిలా సెట్‌లో అటూ ఇటూ దూకుతూ, సరదాగా జోకులు వేస్తూ, అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది,” అని నయనతార వివరించారు. సెట్‌లో ఆయన చిలిపి చేష్టలు, సరదా వాతావరణం సృష్టించే తీరును ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.

రూ. 65కోట్లు పెడితే.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు

అయితే, ఇప్పుడు ప్రభాస్ బాహుబలి వంటి భారీ విజయం తర్వాత ఓ బ్రాండ్‌గా, పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన తీరును చూసి నయనతార ఆనందం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో ఆయనను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, ఆయన ఎదుగుదల పట్ల గర్వంగా ఉందని నయన్ పేర్కొన్నారు. ఒకప్పుడు సెట్స్‌లో చిలిపిగా తిరిగిన ప్రభాస్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్‌గా మారడం పట్ల ఆమె ఆనందాన్ని పంచుకున్నారు.

ఆ హీరోలతో సినిమాలు చేయడం కష్టం.. నా వల్ల కాదు! ఓపెన్‌గా చెప్పేసిన తేజ

Prabhas

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.