Reading Time: < 1 minute

కుత్బుల్లాపూర్ రెవెన్యూ ఆఫీస్‌లో వడ్డీ దందా .. రూ.30 వడ్డీ పేరుతో వేధింపులు..సస్పెండెడ్ వీఆర్ఏపై కేసు

Caption of Image.

ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి.. కొందరి అక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయిలుగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో వెలుగుచూసిన వడ్డీ దందా కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగం పోయినా, ఆ తిమింగలం మాత్రం తన వేటను ఆపలేదు. రెవెన్యూ ఆఫీస్‌ను కేంద్రంగా చేసుకొని అమాయక ఉద్యోగులను వేధిస్తున్న నకిలీ వడ్డీ వ్యాపారి బాగోతం బట్టబయలైంది.

కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో వాసు అనే వ్యక్తి గతంలో విఆర్ఏగా పనిచేశాడు. అయితే ప్రభుత్వ భూముల కబ్జా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది. కానీ, సస్పెండ్ అయ్యాననే భయం లేకుండా వాసు అదే రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తన దందాలు కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా ఆ కార్యాలయంలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ.. రూపాయికి ముప్పై రూపాయల (రూ.30) చొప్పున భారీ వడ్డీ దందా నడిపిస్తున్నాడు.

ఇదే కార్యాలయంలో ఎర్రోల్ల రేణుక అనే మహిళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమెను లక్ష్యంగా చేసుకున్న వాసు.. అప్పు పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ విపరీతంగా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. అధిక వడ్డీ చెల్లించాలంటూ రోజూ మానసిక వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు తీవ్ర ఆందోళనకు గురైంది. వాసు వేధింపులు భరించలేక చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలు ఎర్రోల్ల రేణుక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో నిందితుడు వాసుపై ఎఫ్‌ఐఆర్ (FIR 1135/2026) నమోదైంది. BNS చట్టం సెక్షన్ 308(2) కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. గతంలో భూ కబ్జా ఆరోపణలతో సస్పెండైన వ్యక్తి.. ఇప్పుడు రెవెన్యూ కార్యాలయాన్నే అడ్డాగా మార్చుకుని వడ్డీ దందాలు చేస్తుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. 

 

©️ VIL Media Pvt Ltd.