Reading Time: 2 minutes

నేటి ‘జెన్ జీ’ (Gen Z) తరం ఉద్యోగం చేసే తీరులో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఒకే కంపెనీలో ఏళ్లకు ఏళ్లు ఉండిపోవడం కంటే, నైపుణ్యాలు పెంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగడమే నూతన ఆలోచనా విధానం. కేవలం ఎక్కువ జీతం వస్తే సరిపోదని, పని-జీవిత సమతుల్యత మరియు వ్యక్తిగత ఎదుగుదలే ము ముఖ్యమని ఈ యువత స్పష్టం చేస్తోంది. మారిన ఈ జెన్ జీ మైండ్‌సెట్, కార్పొరేట్ ప్రపంచంలో తెస్తున్న సరికొత్త మార్పుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జీతం కంటే నేర్చుకోవడానికే ప్రాధాన్యం: గతంలో భారీ జీతం ఇచ్చే ఉద్యోగాల వైపే ప్రతి ఒక్కరూ మొగ్గు చూపేవారు. కానీ అన్‌స్టాప్‌ టాలెంట్‌ రిపోర్ట్‌ 2026 ప్రకారం, 60 శాతానికి పైగా జెన్ జీ యువత తమకు కొత్త విషయాలు నేర్పించే, నైపుణ్యాలు పెంపొందించే కంపెనీలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు.

కంపెనీలు, యువత మధ్య గ్యాప్: జెన్ జీ ఆలోచనలను అందుకోవడంలో చాలా సంస్థలు వెనుకబడుతున్నాయి. కేవలం 36 శాతం మంది హెచ్‌ఆర్ (HR) నాయకులు మాత్రమే ఈ కొత్త తరాన్ని సరిగ్గా నిర్వహించగలమని భావిస్తున్నారు. ఈ ఆలోచనా అంతరం వల్ల యువ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోంది.

Gen Z Is Switching Jobs to Build Better Careers: Here’s Why
Gen Z Is Switching Jobs to Build Better Careers: Here’s Why

ఉద్యోగాలు వేగంగా మారడానికి కారణాలు: కెరీర్ ప్రారంభంలో ఉన్నవారిలో సగానికి పైగా ఉద్యోగులు కంపెనీ మారడానికి ప్రధాన కారణం ఎదుగుదల అవకాశాలు లేకపోవడమే. ఇక ఒకే చోట స్థిరంగా ఉండిపోవడం కంటే, కొత్త సవాళ్లను స్వీకరిస్తూ వేగంగా ముందుకు వెళ్లడానికే యువత మొగ్గు చూపుతోంది.

పారదర్శకత లేకపోతే నో చెబుతున్నారు: జీతాలు, ప్రమోషన్లు, కెరీర్ ఎదుగుదల విషయంలో స్పష్టత లేని కంపెనీలకు జెన్ జీ వెంటనే గుడ్ బై చెప్తోంది. ఇక నియామక ప్రక్రియ నుంచే పారదర్శకత లేకపోతే, సగం లోనే తప్పుకోవడానికి కూడా వెనుకాడటం లేదు.

జెన్ జీ తరం కేవలం ఉద్యోగం చేయడం లేదు, తమ కెరీర్‌ను ఒక పక్కా ప్రణాళికతో డిజైన్ చేసుకుంటోంది. కంపెనీలు కూడా ఈ మార్పును గుర్తించి పారదర్శకత, నేర్చుకునే వాతావరణం కల్పిస్తేనే ప్రతిభావంతులైన యువతను నిలుపుకోవడం సాధ్యమవుతుంది.

గమనిక: ఇది తాజా నివేదికలు మరియు మారుతున్న కార్పొరేట్ ట్రెండ్స్ ఆధారంగా అందించిన విశ్లేషణ మాత్రమే.

The post ఉద్యోగం మారుస్తూ కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటున్న Gen Z.. ఆలోచలు ఇవే appeared first on Manalokam – Latest Telugu News & Updates.