
22A పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. 22Aపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. 22A బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. అధికారులతో తరుచుగా రివ్యూలు చేస్తున్నాం.. 22A సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్ పెట్టాం.. టోల్ ఫ్రీ నంబర్ కు 1162 కాల్స్ మాత్రమే వచ్చాయి..జెన్యూన్ సమస్యలను 24 గంటల్లోగా పరిష్కరిస్తామన్నారు పొంగులేటి.
22A సమస్య ముఖ్యంగా కోర్ హైదరాబాద్ లో జఠిలంగా ఉంది. అధికారులతో రివ్యూ చేస్తున్నామన్నారు. 22A సమస్య పరిష్కారం కోసం పెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ కు 1162 కాల్స్ వచ్చాయి. జిల్లాల వారిగా వచ్చిన కాల్స్ ను ఆయా జిల్లా కలెక్టర్లకు ఫార్వర్డ్ చేసి సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. 22A తో రిజిస్ట్రేషన్లు ఆగితే అవి జెన్యూన్ అయితే 24 గంటల్లో పరిష్కరిస్తామన్నారు.
ఎక్కడైనా పరిష్కారం కానీ సమస్యలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేగంగా పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులేటి. గడిచిన వారం రోజులు అధికారులు 24 గంటలు శ్రమించి సమస్య పరిష్కారానికి కృషి చేశారని అన్నారు.
తప్పుడు పత్రాలతో వచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు మంత్రి పొంగులేటి. కొందరు దొంగ జీవోలు సృష్టించి గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిపై క ఠిన చర్యలు ఉంటాయన్నారు. ఏవైనా లే అవుట హై లెవెల్ బిల్డంగ్స్ కి కోర్టు పర్మిషన్ ఇస్తే అదే మెన్షన్ చేస్తామన్నారు. స్లాట్ బుక్ చేసిన 98 శాతం రిజిస్ట్రేషన్లు క్లియర్ చేశామన్నారు. 22A పరిధిలోని రిలాక్సేషన్ కింద వచ్చిన వాటిని క్లియర్ చేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.