Reading Time: < 1 minute

పవర్ గ్రిడ్‌లో 270 అప్రెంటిస్ ఉద్యోగాలు: పరీక్ష లేదు, ఫీజు లేదు.. వెంటనే అప్లై చేసుకోండి!

Caption of Image.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పవర్ గ్రిడ్) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు.  

పోస్టు పేరు: అప్రెంటిస్. 

మొత్తం: 270.

విభాగాల వారీగా ఖాళీలు: ఐటీఐ – ఎలక్ట్రీషియన్ 64, డిప్లొమా (ఎలక్ట్రికల్) 122, డిప్లొమా (సివిల్) 35, గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రికల్) 34, గ్రాడ్యుయేట్ (సివిల్) 15. తెలంగాణ రీజియన్ పరిధిలో  8 ఖాళీలు ఉన్నాయి. 

ఎలిజిబిలిటీ
*ఎలక్ట్రీషియన్ ట్రేడులో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 
*సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​లో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
*ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగ్​లో బీఈ/ బి.టెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) పూర్తిచేసి ఉండాలి. 
*కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 27.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 10. 

సెలెక్షన్ ప్రాసెస్: విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ట్రైనింగ్ స్లాట్స్ ప్రకారం 1:5 నిష్పత్తిలో, మెరిట్ క్రమంలో అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ powergrid.inను సందర్శించండి. 

►ALSO READ | JAM – 2027 నోటిఫికేషన్ వచ్చేసింది! డిగ్రీ అర్హతతో టాప్ ఐఐటీల్లో కాలేజీల్లో పీజీ చేసే ఛాన్స్..

©️ VIL Media Pvt Ltd.