Reading Time: < 1 minute

మ్యాట్ నీడలో ట్రీట్ మెంట్.. అధ్వానంగా మంచిర్యాల జీజీహెచ్ డయాలిసిస్ సెంటర్

Caption of Image.
  • పెచ్చులూడుతున్న స్లాబ్, గ్రీన్ మ్యాట్ తో మేనేజ్ చేస్తున్న సిబ్బంది

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) ఆవరణలోని డయాలిసిస్ సెంటర్ పరిస్థితి అధ్వానంగా మారింది. బిల్డింగ్ శిథిలావస్థకు చేరడంతో స్లాబ్ పెచ్చులు ఊడి పడుతుండగా, గోడల నుంచి వర్షపు నీరు లీక్ అవుతోంది. పైకప్పు పెచ్చులు కిందపడకుండా గ్రీన్ మ్యాట్ కట్టి అక్కడే పేషెంట్లకు డయాలిసిస్ కొనసాగిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పేషెంట్లు, సిబ్బంది  భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు.

మంచిర్యాల కాలేజీ రోడ్ లోని మార్కెట్ యార్డు ఆవరణలో నూతన జీజీహెచ్ భవనం నిర్మిస్తున్నారు. కానీ ఆ పనులు ఆలస్యం అవుతుండడంతో ఐబీలోని పాత బిల్డింగుల్లోనే హాస్పిటల్ నడుపుతున్నారు. డయాలిసిస్ సెంటర్ కోసం పాత మెడికల్ కాలేజీకి చెందిన ఓ భవనాన్ని కేటాయిస్తామని అధికారులు చెబుతుండగా, త్వరగా షిఫ్ట్ చేయాలని పేషెంట్లు, సిబ్బంది కోరుతున్నారు.  

©️ VIL Media Pvt Ltd.