Reading Time: < 1 minute

DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు..లాస్ట్ డేట్ సెప్టెంబర్ 24..ఫుల్ డిటెయిల్స్ ఇవే

Caption of Image.

డీఆర్​డీఓ ఆధ్వర్యంలోని డిఫెన్స్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ బయోడిఫెన్స్ టెక్నాలజీస్ (డీఐబీటీ) రీసెర్చ్ అసోసియేట్ (ఆర్ఏ), జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది.

విభాగాల వారీగా ఖాళీలు: రీసెర్చ్ అసోసియేట్1, జూనియర్ రీసెర్చ్ ఫెలో 4. 

ఎలిజిబిలిటీ

జూనియర్ రీసెర్చ్ ఫెలో: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ  నుంచి ఫస్ట్​క్లాసులో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు నెట్/ గేట్ స్కోరు కలిగి ఉండాలి. లేదా మొదటి శ్రేణిలో ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి.

రీసెర్చ్ అసోసియేట్: ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజినీరింగ్ / ఫుడ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ / ఫుడ్ ఇంజినీరింగ్ విభాగంలో పీహెచ్‌‌డీ  పూర్తిచేసి ఉండాలి. సంబంధిత రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లేదా సిమ్యులేషన్ టూల్స్​పై అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 24.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ drdo.gov.inను సందర్శించండి.

©️ VIL Media Pvt Ltd.