Reading Time: < 1 minute

హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్లు అరెస్టు.. అంతా నర్సులు, కాంపౌండర్లు, మెడికల్ షాపు ఓనర్లే!

Caption of Image.

డాక్టర్ వృత్తికి ఉన్న డిమాండ్ ను క్యాష్​ చేసుకోవాలని.. కనీసం స్టెతస్కోప్ పట్టుకోడానికి కూడా అర్హత లేని వాళ్లు డాక్టర్ల అవతారం ఎత్తారు. జనాలా ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఫేక్ డాక్టర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. 2026 ఆగస్టు 25న నిర్వహించిన దాడులలో 11 మంది నకిలీ వైద్యులు పట్టబడ్డారు. 

టాస్క్ ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ జోన్లలో రైడ్స్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 11 మంది ఫేక్ డాక్టర్స్ తో పాటు ఒక మెడికల్ షాప్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో అందరూ నర్సులు, కంపౌండర్ల, మెడికల్ షాప్ ఓనర్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. కొన్ని మందుల పేర్లు తెలియటం, డాక్టర్ల దగ్గర పనిచేసిన అనుభవంతో ఏకంగా క్లినిక్ లు పెట్టి డాక్టర్లు గా చెలామణి అవుతుండటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. 

ALSO READ : కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో జూబ్లీహిల్స్ సీఐ సస్పెన్షన్

ఈ నకిలీ డాక్టర్లు రోజుకు 20 మందికి ట్రీట్ మెంట్ ఇస్తున్నట్టు గుర్తించారు. కాంపౌండర్ గా పని చేసి డాక్టర్లు గా చెప్పుకుంటున్నట్లు స్థానికులు చెప్పారు. వైద్యావతారం ఎత్తటంతో పాటు మెడిసిన్స్ కూడా సొంతంగా తయారు చేస్తున్నట్లు ఆరోపణలు రావటం ఆందోళన కలిగిస్తోంది. అన్ని ప్రమాణాలతో తయారు చేసే మందులే ఒక్కోసారి రియాక్షన్ అయ్యి ప్రాణలమీదికి వస్తున్న తరుణంలో.. వైద్య విద్యపై కనీస అవగాహన లేని వీళ్లు మందులు తయారు చేసి అమాయకులను ఏం చేస్తారా అనేదే అసలు ప్రశ్న. నిందితులను కఠినతంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.