Reading Time: < 1 minute
Team India: టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఒకరిద్దరు కాదు, రీఎంట్రీకి సిద్ధమైన ముగ్గురు తోపులు..!

Jasprit Bumrah Hardik Pandya Comeback: భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుందా..? కీలకమైన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, యువ పేసర్ హర్షిత్ రాణా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచునే క్రమంలో బిజీగా ఉన్నారు. ఆగస్టు 25న హర్షిత్ రాణా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బుమ్రా, హార్దిక్‌తో కలిసి జిమ్‌లో దిగిన ఫొటోను పంచుకున్నాడు. ముగ్గురూ కలిసి వర్కౌట్ చేస్తుండటం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. బుమ్రా ఇప్పటికే ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. దీర్ఘకాలిక ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని అతడి వర్క్‌లోడ్‌ను జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌కు సిద్ధంగా ఉండేలా బుమ్రా విషయంలో జట్టు మేనేజ్‌మెంట్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది.

హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఎప్పుడు..?

హార్దిక్ పాండ్యా ప్రస్తుతం క్వాడ్రిసెప్స్ గాయం నుంచి కోలుకునేందుకు ప్రత్యేక రిహాబిలిటేషన్, స్ట్రెంగ్త్ ప్రోగ్రామ్‌ను అనుసరిస్తున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే అతడిని వైట్‌బాల్ మ్యాచ్‌లకు అందుబాటులోకి తీసుకురావాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

మార్చి 2026లో జరిగిన న్యూజిలాండ్ సిరీస్ తర్వాత హార్దిక్ భారత్ తరఫున ఆడలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, వెస్టిండీస్‌తో జరిగే స్వదేశీ వన్డే సిరీస్‌కు అతడు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బుమ్రా, హర్షిత్‌కు మరో కీలక బాధ్యత..

బుమ్రా, హర్షిత్ రాణా ఇద్దరూ జపాన్‌లో జరిగే 2026 ఆసియా క్రీడల కోసం భారత పూర్తి స్థాయి జట్టులో ఎంపికయ్యారు. ఆఫ్ఘనిస్థాన్‌తో స్వదేశీ సిరీస్ తర్వాత జరిగే ఈ టోర్నీలో భారత్ తమ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

హర్షిత్ విషయానికొస్తే, ఫిబ్రవరిలో మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత హ్యామ్‌స్ట్రింగ్ సమస్య కూడా ఎదురైంది. దీంతో అతడు పలు వైట్‌బాల్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

బుమ్రా, హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ ఇప్పుడు భారత జట్టు భవిష్యత్ వైట్‌బాల్ ప్రణాళికల్లో కీలకంగా మారింది. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని వీరిద్దరి ఫిట్‌నెస్‌ను జట్టు మేనేజ్‌మెంట్ అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..