Reading Time: < 1 minute

పూర్తిగా నిండిన కడెం ప్రాజెక్ట్… పెరుగుతున్న వరద.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే ఛాన్స్..!

Caption of Image.

కడెం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండింది. కడెం ప్రాజెక్ట్ సామర్థ్యం 700అడుగులు కాగా.. ఇప్పటికే 700 అడుగుల మేర నిండి ఉండగా.. క్రమంగా వరద ఉదృతి పెరుగుతుండటంతో ఏ క్షణమైనా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది. గత కొన్ని గంటలుగా ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

వరద ఉదృతి ఇలాగె కొనసాగితే… ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా 18 గేట్లలో 16 గేట్ల ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.ఏ క్షణమైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ప్రాజెక్టు దిగువన గల నది పరివాహ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు, ఇతరులు నది ఒడ్డుకు లేదా పరివాహక ప్రాంతంలోకి వెళ్లకుండా ఉండవలసిందిగా సూచించారు అధికారులు.
 

©️ VIL Media Pvt Ltd.