Reading Time: < 1 minute

Hyderabad: కేపీహెచ్‌బీలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

Caption of Image.

హైదరాబాద్ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మానసిక ఒత్తిడితో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. కేపీహెచ్‌బీ పరిధిలోని 6వ ఫేస్‌లో ఉన్న పంచమతి  అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తు నుంచి దూకి శీతల పురుషోత్తం (30) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

 గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న శీతల పురుషోత్తం, దానికోసం మెడిసిన్ వాడుతున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.