
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో ఓవైసీ తన కుమారుడితో కలిసి స్టేజ్‌పై కనిపించారు. సభ జరుగుతున్న సమయంలో కొడుకుతో ఓవైసీ మాట్లాడుతున్న దృశ్యాలు, ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
అసదుద్దీన్ ఓవైసీ గతంలోనూ తన నియోజకవర్గ పర్యటనలు, ఎన్నికల ప్రచార సమయాల్లో కొడుకును వెంట తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలను కలిసే కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన పలు ఈవెంట్లలోనూ తండ్రీకొడుకులు కలిసి పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. నియోజకవర్గంలో పర్యటించే సమయంలో ప్రజలను కలవడం, కార్యకర్తలతో మాట్లాడటం వంటి కార్యక్రమాల్లో కొడుకు ఆయన వెంట కనిపించడం గమనార్హం.
ఎప్పుడూ రాజకీయ కార్యక్రమాలు, సభలు, సమావేశాలతో బిజీగా ఉండే ఓవైసీ.. తాజాగా రాత్రి జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో తన కొడుకును వెంటబెట్టుకుని స్టేజ్‌పై కనిపించడం మరోసారి చర్చనీయాంశమైంది. సభా వేదికపై ఇద్దరూ పక్కపక్కనే ఉండగా.. ఓవైసీ కొడుకుతో మాట్లాడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.