
హైదరాబాద్, వెలుగు: అధికార కాంగ్రెస్ పార్టీలో ఆగస్టు సంక్షోభం రావడం ఖాయమని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆ పార్టీలో ఎవరి గద్దెను ఎవరు కూల్చుతారో, ఎవరిని ఎవరు దించుతారో చూడాల్సిందేనన్నారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో డీకే అరుణ చిట్ చాట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏ విషయమైనా పబ్లిసిటీ చేసుకోవడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.
రేవంత్‌కు అన్నీ తెలుసని, కేంద్రంలో తమ పాస్‌పోర్టులకు కూడా క్లియరెన్స్ ఉండాలనే విషయం కూడా తెలుసని పేర్కొన్నారు. అయినా పబ్లిసిటీ కోసం ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ ఎంపీల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. తమ ఎంపీలమంతా ఎప్పుడూ కలిసే ఉన్నామని. కలిసే ఉంటామని స్పష్టం చేశారు.