Reading Time: < 1 minute

లారీ డ్రైవర్ పై బ్రేక్ ఇన్‌స్పెక్ట‌ర్ డ్రైవర్ దాడి… రక్తం వచ్చేలా పిడిగుద్దులతో…

Caption of Image.

ఏపీలోని గాజువాకలో దారుణం జరిగింది.బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ ఓ లారీ డ్రైవర్ పై అమానుషంగా దాడి చేశాడు. సోమవారం ( ఆగస్టు 24 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. గాజువాకలోని షీలానగర్ మారుతి జంక్షన్ దగ్గర జరిగింది ఈ ఘటన. వాహనం ఆపకపోవడంతో లారీని ఓవర్ టేక్ చేశారు బ్రేక్ ఇన్స్పెక్టర్ పార్వతి. పార్వతి సమక్షంలోనే ఆమె డ్రైవర్ వీరంగం సృష్టించాడు.

లారీ డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. రక్తం వచ్చేలా పిడిగుద్దులతో దాడి చేశాడు పార్వతి డ్రైవర్. ఈ అంశంపై ఏపీ లారీ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు నిరసనగా ధర్నాకు సిద్ధమని తెలిపారు ఆలోసియేషన్ సభ్యులు. దౌర్జన్యంగా వ్యవహరించిన బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ పై, బ్రేక్ ఇన్స్పెక్టర్ పార్వతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రజా పాలన అంటూ ప్రభుత్వం చెబుతుంటే.. అధికారుల తీరు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటోంది. ప్రజా సేవకులుగా వ్యవహరించాల్సిన అధికారులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ అధికారుల పట్ల మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. 
 

©️ VIL Media Pvt Ltd.