Reading Time: 2 minutes
Video: ఇలా కూడా ఔటవుతారా.. ఆ ఒక్క తప్పుతో ఊహించని షాకిచ్చిన అంపైర్..

Joseph Moores Obstructing the Field Out: కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. లాంకషైర్‌, నార్తాంప్టన్‌షైర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోసెఫ్‌ మూర్స్‌ వింతగా ఔటై పెవిలియన్ చేరాడు. లాంకషైర్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఈ వింగ ఘటన చోటు చేసుకుంది. అయితే, బంతి వికెట్లను తాకుతుందేమోనని భావించిన మూర్స్‌.. వెనక్కి వెళ్లి దానిని ఓ చేత్తో గట్టిగా పట్టుకున్నాడు. ఆ వెంటనే తప్పు తెలుసుకుని బంతిని వదిలేశాడు. కానీ అప్పటికే నార్తాంప్టన్‌షైర్‌ ఆటగాళ్లు అప్పీల్‌ చేశారు. దీంతో అంపైర్‌ ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’ కింద ఔట్‌గా ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. బంతి సాధారణంగా వికెట్ల వైపు వెళ్లకపోయినా ఈ నిర్ణయం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇలా ఔటైన 43వ బ్యాటర్‌గా మూర్స్‌ నిలిచాడు.

‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’ అంటే..?

ఎంసీసీ లా 37 ప్రకారం.. బ్యాటర్‌ ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌ జట్టును అడ్డుకున్నా లేదా దృష్టి మరల్చినా అతడిని ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’ కింద ఔట్‌ చేయొచ్చు.

అయితే, బంతి శరీరానికి తగలడం ప్రమాదవశాత్తు జరిగితే, ఆత్మరక్షణ కోసం లేదా గాయం కాకుండా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా జరిగితే ఈ నిబంధన కింద ఔట్‌ ఇవ్వకూడదన్నమాట.

ఎక్కువమంది చదివినది: Rishabh Pant: జస్ట్ 63.. ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటో తెలుసా..?

అదే సమయంలో బంతి వికెట్లను తాకకుండా అడ్డుకునేందుకు బ్యాటర్‌ తన బ్యాట్‌ లేదా శరీరాన్ని ఉపయోగించవచ్చు. కానీ బ్యాట్‌ను పట్టుకుని చేత్తో ఉద్దేశపూర్వకంగా బంతిని ఆపితే మాత్రం ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’ కింద ఔట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. మూర్స్‌ విషయంలో బంతి వికెట్లను తాకుతుందేమోననే ఉద్దేశంతో చేత్తో పట్టుకోవడం కీలకంగా మారింది.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 43వ బ్యాటర్‌గా..

 

View this post on Instagram

 

A post shared by Fox Cricket (@foxcricket)

ఈ విచిత్ర ఘటనతో జోసెఫ్‌ మూర్స్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’ కింద ఔటైన 43వ బ్యాటర్‌గా నిలిచాడు. క్రికెట్‌లో ఇది చాలా అరుదైన ఔట్‌. గతంలోనూ పలువురు ప్రముఖ బ్యాటర్లు ఈ విధంగా ఔటయ్యారు. అందులో భారత అభిమానులకు బాగా గుర్తుండిపోయే ఘటన ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్‌ వా ఔట్‌.

స్టీవ్‌ వా నుంచి బెన్‌ స్టోక్స్‌ వరకు..

2001లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో జరిగిన టెస్టు సిరీస్‌లో స్టీవ్‌ వా ఈ నిబంధన కింద ఔటయ్యాడు. హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌ ఆడటంలో విఫలమైన వా.. బంతి వికెట్ల వైపు తిరిగి రావడంతో దానిని తన చేత్తో కొట్టి పక్కకు పంపించాడు. దీంతో అంపైర్‌ అతడిని ఔట్‌గా ప్రకటించాడు.

ఎక్కువమంది చదివినది: Video: దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?

ఆధునిక క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ ఘటన కూడా కీలకమైనదే. న్యూజిలాండ్‌ బౌలర్‌ కైల్‌ జేమీసన్‌ వేసిన బంతిని డిఫెండ్‌ చేసిన తర్వాత.. అది పైకి లేచి ఆఫ్‌సైడ్‌ వైపు వెళ్లింది. రహీమ్‌ తన కుడిచేత్తో దానిని కొట్టి పక్కకు పంపాడు. దీంతో అతడిని కూడా ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’ కింద ఔట్‌ చేశారు.

బెన్‌ స్టోక్స్‌, మైఖేల్‌ వాన్‌ కూడా ఇలాంటి ఘటనల్లో భాగమయ్యారు. 2015లో ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌ బంతిని చేత్తో తాకడంతో ఔటయ్యాడు. భారత్‌తో బెంగళూరులో జరిగిన టెస్టులో మైఖేల్‌ వాన్‌ కూడా వికెట్ల వైపు వస్తున్న బంతిని చేత్తో పక్కకు పంపే ప్రయత్నంలో ఔటయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..