Reading Time: < 1 minute

రవితేజ ‘ఇరుముడి’ కోసం థియేటర్‌ ముందు ధర్నా.. సినిమా ఆపేశారని మక్తల్‌లో ఫ్యాన్స్ ఆందోళన!

Caption of Image.

సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లడం కామన్.. కానీ సినిమా వేయలేదని అదే థియేటర్‌ ముందు ధర్నాకు దిగడం మాత్రం వెరీ వెరీ రేర్. నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఇప్పుడు ఇదే సీన్ కనిపించింది. వెంకటరమణ థియేటర్‌ ముందు బుధవారం ఉదయం ( ఆగస్టు 26, 2026 )  ఒక్కసారిగా ప్రేక్షకులు, అయ్యప్ప భక్తులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన సినీ ప్రియులు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అసలు మ్యాటర్ ఏంటంటే..

గత ఐదు రోజులుగా ఈ థియేటర్‌లో రవితేజ నటించిన ‘ఇరుముడి’ హౌస్‌ఫుల్ షోలతో దూసుకెళ్తోంది. టికెట్ల కోసం జనం భారీగా క్యూ కడుతున్నారు. కొందరికి టికెట్లు దొరకక వెనుదిరగాల్సి వస్తోందట. మంగళవారం రాత్రి కూడా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చినా టికెట్లు దొరకలేదని చెబుతున్నారు. కనీసం బుధవారం అయినా సినిమా చూద్దాం అని ఆశగా వచ్చిన వారికి మాత్రం షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది.

ప్రేక్షకులు ధర్నా..

ఉదయం థియేటర్‌ వద్దకు వచ్చేసరికి ‘ఇరుముడి’మూవీ స్థానంలో ‘టాక్సిక్’ ప్రదర్శనకు సిద్ధం కావడం ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సినిమా మళ్లీ వేయాల్సిందే అంటూ గేటు ముందు ధర్నాకు దిగారు. అవసరమైతే నేలపై కూర్చొని అయినా చూస్తామని, ఎంత రద్దీ ఉన్నా భరిస్తామని స్పష్టం చేశారు. అసలు ఎవరి ఒత్తిడితో ‘ఇరుముడి’ని తీసేశారో థియేటర్‌ యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేశారు.

ALSO READ : ‘టాక్సిక్’ మూవీలో స్టయిల్ ఎక్కువ.. 

బాక్సాఫీస్ రికార్డులతో..

బాక్సాఫీస్ దగ్గర ‘ఇరుముడి’ జోరు మామూలుగా లేదు. ఐదో రోజుకే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్ దాటింది.  భారత్‌లో నెట్ వసూళ్లు రూ.75 కోట్లను దాటినట్లు సమాచారం. రవితేజ కెరీర్ లో అత్యంత వేగంగా రికార్డులు సృష్టించిన చిత్రంగా నిలిచింది. కొత్త సినిమాల రాకతో ‘ఇరుముడి’ షోలను రద్దు చేయాల్సివస్తుంది. అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మోత.. ఎలా ఉన్నా.. మక్తల్‌లో అభిమానుల ధర్నా చూస్తే ఈ మూవీ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం అవుతోంది.

 

©️ VIL Media Pvt Ltd.