
మొదట్లో అతను చేస్తున్న పనిని చూసి పొరపాటు పడ్డారు. కొన్ని నిమిషాలు గడిచాక అతడిని అభినందించకుండా ఉండలేకపోయారు. మనిషి అంటే ఇలా ఉండాలి..మానవత్వం ఇంకా బతికే ఉంది. ఇలాంటోళ్లు ఉన్నారు కాబట్టే ఇంకా సమాజం కొంత ముందుకు సాగుతుందని ప్రశంసలు కురిపించారు. కాలం గడుస్తున్న కొద్దీ మనిషి మానవత్వం అనే మాటకు అర్థం లేకుండా పోతున్న క్రమంలో బెంగళూరులో ఊబర్ ఆటో డ్రైవర్ ఓ యువతికి సాయం అందించిన వీడియో వైరల్ అవుతుండగా ఇలా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆ ఆటో డ్రైవర్ యువతికి ఏవిధంగా సాయం చేశాడో చూద్దాం.
ఇటీవల బెంగళూరు సిటీ ట్రిప్ కు వెళ్లిన ఓ వ్యక్తి తనకు ఎదురైన అనుభవమే ఈ వైరల్ అవుతున్న వీడియో. chetnaaasaraf అనే అకౌంట్ ద్వారా ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో స్కూటీ పాడై పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ టీనేజర్ కు ఊబర్ ఆటో వాలా సాయం చేసిన తీరు కనిపిస్తుంది. ఆటో డ్రైవర్ హెల్పింగ్ నేచర్ నునెటిజన్లు అభినందించారు.
ఈ వీడియోలో యువతి స్కూట్ పాడవడంతో అవస్థలు పడుతోంది. ఇంతలో అటుగా వచ్చిన ఊబర్ ఆటో డ్రైవర్ ఆమె స్కూటి వెనక భాగంలో కాలు పెట్టి నెడుతున్నట్లుగా కనిపిస్తుంది. మొదట ఈ వీడియో చూసిన వారంతా ఆమెను ఆటో డ్రైవర్ వేధిస్తున్నారని అనుకున్నారు. అయితే ప్రత్యేకంగా గమనించినప్పుడు అతడి హెల్సింగ్ నేచర్ గుర్తించారు.
ALSO READ : ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు
దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ఆమె స్కూటీని నడిపించారు ఆటోడ్రైవర్. స్కూటీ వెనకభాగంలో కాలు పెట్టి ఆటో డ్రైవర్ చేస్తూ ముందుకు నడిపించాడు. దాదాపు 20 నిమిషాల పాటు అలా నడిపిస్తూ మెకానిక్ షాపు వచ్చిన చోట వదలేశాడు. దీంతో ఆ యువతితో పాటు చూసినవారంతా అతనికి థ్యాంక్స్ చెప్పారు.అభినందించారు.
ఈ వీడియో నెట్టింట షేర్ చేసిన కొద్దిగంటల్లో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఆటో డ్రైవర్ హెల్పింగ్ నేచర్ ను ప్రశంసిస్తూ పోస్టులు షేర్ చేశారు. ఇలాంటి వాళ్ల వల్ల ఇంకా ఈ సమాజంలో కొంత మానవత్వం కనపడతుందని కొనియాడారు.