Reading Time: < 1 minute

వెంకటాపూర్ మండలంలో కేంద్రం కృషితో జిల్లాలో తొలి సీబీఎస్ఈ స్కూల్

Caption of Image.

వెంకటాపూర్( రామప్ప), వెలుగు : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మంగళవారం సందర్శించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 5వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాల ఏర్పాట్లను పరిశీలించారు. 

ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ వెనుకబడిన ములుగు జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం గర్వకారణమని, కేంద్రం కృషితో జిల్లాలో తొలి సీబీఎస్‌‌‌‌‌‌‌‌ఈ పాఠశాల అందుబాటులోకి రావడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్యా జవహర్‌‌‌‌‌‌‌‌లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలమంతుల రవీంద్రాచారి, జిల్లా ఉపాధ్యక్షుడు జినుకల కృష్ణాకర్‌‌‌‌‌‌‌‌రావు తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.