Reading Time: 2 minutes
ఈ చిన్నారి చాలా పాపులర్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఏం చేస్తుందంటే..

సినిమా సినిమాలో హీరోలు, హీరోయిన్స్, విలన్స్ మాత్రమే కాదు కొందరు చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలు, హీరోయిన్స్ కు మించి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. వారిలో పైన కనిపిస్తున్న చిన్నారి ఒకరు. పై ఫొటోలో స్టార్స్ తో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రల్లో నటిస్తూ అలరించింది ఆ చిన్నది. ఆ ముద్దుగుమ్మ పేరు బేబీ రక్షణ. తెలుగులో ఈ అమ్మడు చాలా మందికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ  తమిళ డబ్బింగ్ సినిమాలు చూసే వారికి ఈ అమ్మడు తెలిసే ఉంటుంది. 2011లో వచ్చిన కార్తీ నటించిన సిరుత్తై సినిమాతో తెరంగేట్రం చేసింది రక్షణ. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడికి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీలో కార్తీ కూతురిగా నటించిందీ అమ్మాయి. మొదటి సినిమాలోనే తన క్యూట్ నెస్ తో అందరినీ కట్టి పడేసింది. దీని తర్వాత కూడా ఈ పాపకు వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ల మణిరత్నం, సముద్రఖని లాంటి  పెద్ద దర్శకుల సినిమాల్లో నటించింది. అయితే వీటి తర్వాత సినిమాలేవీ చేయలేదీ అమ్మడు.  నటనకు గ్యాప్ ఇచ్చి చదువుల పై దృష్టి పెట్టింది. కాగా ఇటీవలే ఈ అమ్మడు ఇంటర్ పూర్తి చేసింది రక్షణ. అయితే ఆమె సినిమాల్లోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ సినిమాలకంటే చదువే ముఖ్యమంటోందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది రక్షణ. తన వ్యక్తిగత వివరాలన్నింటినీ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను కూడా అందులో పంచుకుంటోంది.

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

ఈ అమ్మడి ఫొటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు లైకులు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు సినిమా అవకాశాలు వస్తున్నా.. అందుకు తాను ఇప్పుడే సిద్ధంగా లేనంటోంది రక్షణ. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ ప్రస్తుతం నాకు సినిమా ఛాన్సులు వస్తున్నాయి. హీరోయిన్ గా చేయమని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు నేను అందుకు సిద్ధంగా లేను. ప్రస్తుతం నా దృష్టంతా చదువు, క్లాసిక్‌ డ్యాన్స్‌ల మీదే ఏంది. కాస్త టైం తీసుకుని మంచి అవకాశం వచ్చాకే మళ్లీ కెమెరా ముందుకు వస్తాను’ అంటోంది రక్షణ. ఇక ఈ ముద్దుగుమ్మ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

రక్షణ ఇన్ స్టా గ్రామ్

 

View this post on Instagram

 

A post shared by Rakshana Shri Menon (@shri.rakshana)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.