
మంచు దేశం నేపాల్ లో ఏ విపత్తు వచ్చినా అది ప్రళయ రూపంలోనే ఉంటుంది. గతంలో వచ్చిన భూకంపాలు గ్రామాలను, పట్టణాలను నేల మట్టం చేయగా.. వర్షాలు అతలాకుతలం చేసిన ఘటనలు ఎన్నో చూశాం. లేటెస్టుగా నేపాల్ లో వస్తున్న వరదలు అదే మాదిరిగా గ్రామీణ ప్రాంతాలను తుడిచిపెట్టేస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోవడం తీవ్ర ఆందోళన కరంగా మారింది.
నేపాల్ వరదలకు టిబెట్ బోర్డర్ లోని ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జీలు, పవర్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. మరింత విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
2026 ఆగస్టు 26న ఉదయం 9 గంటల ప్రాంతంలో వచ్చిన వరదలతో గ్రామాలన్ని కాగితపు పడవల్లా కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. రసువా జిల్లాలోని స్యాప్రు బేసీ ప్రాంతం, టైమూర్ ప్రాంతాల్లో 50 వేల మంది ప్రజలు ప్రభావితం అయ్యారు. భోతె కోశి నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కొట్టుకుపోయినట్లు తెలిపారు. మృతులు వందల సంఖ్యలో ఉండే అవకాశం ఉందని చెప్పారు.