ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు వాడుతున్న వినియోగదారులకు బిగ్ అలర్ట్. కేంద్ర ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ కేవైసీని పూర్తి చేసుకునేందుకు గడువును మరింత పొడిగించాయి. ఆగస్ట్ 16వ తేదీతో ముగిసిన గడువును 23వ తేదీ వరకు పొడిగించగా.. ఇప్పుడు ఆగస్ట్ 31 వరకు అవకాశం కల్పించారు. దీంతో గ్యాస్ వినియోగదారులు ఈ నెలాఖరులోపు కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో గ్యాస్ వినియోగదారులు వెంటనే పూర్తి చేయాలి. ఇప్పటికే పూర్తి చేసి ఉంటే అవసరం లేదు. ఇంకా పూర్తి చేయకపోతే వెంటనే పూర్తి చేయాలని గ్యాస్ కంపెనీలు ఎస్ఎంఎస్లు పంపుతున్నాయి. కేవైసీ ప్రక్రియ పూర్తి చేయనివారికి ఈ మెస్సేజ్‌లు పంపుతున్నాయి. వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నాయి.
కొన్ని రోజులే సమయం ఉండటంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు కస్టమర్లు పరుగులు పెడుతున్నారు. అయితే ఎల్పీజీ ఐడీలతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక గ్యాస్ కనెక్షన్‌ను వేరే ప్రాంతంలోని ఏజెన్సీలకు మార్చుకున్న వినియోగదారులు ఈ ప్రాసెస్ చేయలేకపోతున్నారు. ఐడీ పాత ఏజెన్సీతో అనుసంధానమై ఉండటంతో కేవైసీ సాధ్యపడటం లేదు.
మరణించిన వ్యక్తి ఆధార్‌ను ఉపయోగించకూడదు. దీంతో వారి పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉంటే ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేకపోతున్నారు. దీంతో కనెక్షన్‌ను వేరేవారి పేర్లపైకి మార్చడానికి కొంత సమయం పడుతుంది. దీంతో కుటుంబసభ్యులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొద్ది రోజులు మాత్రమే టైమ్ ఉండటంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద రద్దీ పెరిగింది.
అయితే ఈ ప్రక్రియను ఆన్లైన్లోనే సులువుగా పూర్తి చేయవచ్చు. మీ గ్యాస్ ఏజెన్సీకి చెందిన వెబ్ సైట్, యాప్ ద్వారా ఇంటి నుంచే సులువుగా కేవైసీ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు అవకాశం కల్పిస్తున్నాయి. దీని వల్ల మీ సమయం కూడా ఆదా అవుతుంది.




