
నేపాల్ వరదల్లో 77 మంది ఈషా ఫౌండేషన్ సభ్యులు గల్లంతయ్యారు. టిబెట్ లోని గరాంగ్ ప్రాంతంలో భారీ వరదలు సంభవించడంతో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఈషా ఫౌండేషన్ కు చెందిన 77 మంది వరదల్లో చిక్కుకున్నారు ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు.
ఈషా ఫౌండేషన్ సద్గురు తెలిపిన వివరాల ప్రకారం.. వరదల సమయంలో ఈషా ఫౌండేషన్ బృందం ఓ ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో ఉండగా వరద ఉధృతికి ఆ భవనం కొట్టుకుపోయింది. టీం సభ్యులపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. ఈషా ఫౌండేషన్ టీంలోని 495 మంది సురక్షితంగా తిరిగి వచ్చినట్లు సద్గురు X లో తెలిపారు. మరికొందరు టిబెట్, నేపాల్ ప్రాంతాల్లో ఉన్నారని వెల్లడించారు.
బుధవారం నేపాల్ లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించడంతో నేపాలీలతో సహా దాదాపు 600 మంది గల్లంతయ్యారు. ఊర్ళకు ఊర్లే కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు బురదతో శిథిలాల కింద కూరుకుపోయాయి. నేపాల్ చరిత్రలో ఇంత పెద్ద ప్రకృతి విపత్తు ఇదే తొలిసారి. వరదలతో విద్యుత్ సరఫరా, రవాణ వ్వవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవం రెస్క్యూ బృందాలకు పెద్ద సవాల్ గా మారింది.
నేపాల్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అవసరమైతే ప్రైవేట్ హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. మరిన్ని రెస్క్యూ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ALSO READ : నేపాల్ లో చిక్కుకున్న భారతీయులకోసం..హెల్ప్ లైన్ నంబర్లు ఇవే
మరోవైపు నేపాల్ ప్రధానితో వరదలపై భారత ప్రధాని మోదీ మాట్లాడారు. నేపాల్ కు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. వసుధైవ కుటుంబకం అనే భారతీయ భావనకు అనుగుణంగా పొరుగు దేశమైన నేపాల్‌కు అవసరమైన సహాయాన్ని అందిస్తుందని తెలిపారు.
A terrible and tragic flash flood has taken place at Gyirong in Tibet – China, and one of our Kailash groups was caught in it. While on their way back, they were at the immigration office when the flood occurred and the building and much of the town seems to have been flooded.… pic.twitter.com/CqOBxsPlWo
— Sadhguru (@SadhguruJV) August 26, 2026