Reading Time: 2 minutes
ఈసారి థియేటర్స్‌లో పూనకాలే.. మహాకాళి టీజర్ మాములుగా లేదుగా..! చూస్తే గూస్‌బంప్స్ పక్కా

చేసింది తక్కువ సినిమాలే అయినా అన్నీ గుర్తుండిపోయే సినిమాలు చేసి మెప్పించాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ కుర్ర డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలకు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. తొలి సినిమాతోనే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు. డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు తెరకెక్కిస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. అ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమా తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాగే 2021లో వచ్చిన జాంబీ రెడ్డి సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన తేజ హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హనుమాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు ప్రశాంత్ వర్మ.. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలను లేకుండా వచ్చిన హనుమాన్ సినిమా ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాతో పాటే మరో సినిమాను అనౌన్స్ చేశాడు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం మహా కాళీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. హనుమాన్ యూనివర్ పేరుతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మహాకాళి అనే సినిమాను చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ..

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రియ రెడ్డి నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ ను విడుదల చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కన్నా మహాకాళి సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ గ్లింప్స్‌లో అసురుల గురువైన శుక్రచార్యుడి దేవుళ్ల మీద కోపంతో ఓ అసురుడిని పుట్టించి మానవజాతిని సర్వనాశనం చేయమని ఆజ్ఞాపిస్తాడు. అదే సమయంలో గుడిలో మహాకాళి మాత చంటి బిడ్డకు పాలిస్తూ దర్శనమిస్తుంది. ఈ గ్లింప్స్‌ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ, స్రీన్‌ప్లే అందిస్తుండగా పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గ్లింప్స్‌ పై మీరూ ఓ లుక్కెయండి..

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

మహాకాళి గ్లింప్స్‌



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.