Reading Time: 2 minutes
Anasuya Bharadwaj Latest Comments On Hindu Traditions Controversy

బుల్లితెర యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు సినిమా నటిగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్.. నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటారు. ఈమధ్య కాలంలో ఆమె వార్తల్లోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆమె ఎలా వార్తల్లోకి రావాలా అని ఇప్పుడు కొన్ని విషయాలను కావాలనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన తండ్రి మరణం తర్వాత గత ఐదేళ్లుగా తనను తొలిచివేస్తున్న ఓ ప్రశ్నను ఆమె బహిరంగంగా లేవనెత్తారు. ముఖ్యంగా భర్త చనిపోయిన తర్వాత మహిళల జీవితాల్లో వచ్చే మార్పులు, సమాజం వాళ్లపై రుద్దే నియమాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ డిబేట్ గా మారాయి.

అనసూయ తండ్రి 2021లో మరణించారు. ఆ తర్వాత తమ కుటుంబ పరిస్థితులు ఎలా మారాయో ఆమె వివరిస్తూ.. “మా అమ్మ ముస్తాబైతే చాలా అందంగా ఉంటుంది. నుదుటిన బొట్టు, కళ్లకు కాటుక, చేతులకు రంగుల గాజులు, కాలికి పట్టీలతో ఎంతో నిండుగా ఉండేది. కానీ నాన్న చనిపోయాక సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతో ఆమె అవన్నీ మానేసింది. ఆ పరిస్థితి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఒక మహిళగా నా బాధ ఏంటో తోటి మహిళలు అర్థం చేసుకోగలరు” అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా కొన్ని ఆచారాలను ఆమె సూటిగా ప్రశ్నించారు. “నాకో ప్రశ్న ఎప్పుడూ ఎదురవుతూ ఉంటుంది. ఈ సంప్రదాయాలను మనకు పరిచయం చేసిన అమ్మమ్మలు, నానమ్మలు చనిపోయినప్పుడు మనం ఈ బొట్టు, గాజులు లాంటివి ఎందుకు వదిలేయం? బొట్టు పెట్టుకోవడం అనేది పూర్తిగా ఒక మహిళ వ్యక్తిగత ఇష్టం కదా? శుభకార్యాల్లో, పూజా కార్యక్రమాల్లో మహిళలకే ఇలాంటి ఆంక్షలు ఎందుకు పెడతారు?” అంటూ అనసూయ నిలదీశారు.

అయితే ఇక్కడే అసలు వివాదం రాజుకుంది. 2021లో తండ్రి చనిపోయినప్పుడు సైలెంట్ గా ఉన్న అనసూయ.. సడెన్ గా మూడేళ్ల తర్వాత ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లతో అనసూయకు పెద్ద వార్ నడిచింది. ఆమె తనను ఆన్ లైన్ లో అబ్యూస్ చేసేది ఎక్కువగా హిందూ నెటిజన్లని అంటూ కామెంట్ చేయడంతో వాళ్లు తనను టార్గెట్ చేసినందుకే, దానికి కౌంటర్ గా కావాలనే అనసూయ హిందూ సంప్రదాయాలను వ్యతిరేకిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ సంప్రదాయాలను గౌరవించే వారు గౌరవిస్తున్నారు. లేదు అవి అంత కేరేక్ట్ కాదనుకున్న హిందువులు పాటించడం లేదు. అది ఎవరి వ్యక్తిగతం వారిది, కానీ అనసూయ అయితే కావాలని హిందూ సంప్రదాయాలను టార్గెట్ చేసినట్టే అనిపిస్తోంది. సోషల్ మీడియా వివాదాలకు, తన ఇంట్లో జరిగిన సెంటిమెంట్ ను ముడిపెట్టి.. ఇలా ఆచారాలను టార్గెట్ చేస్తూ పక్కా స్కెచ్ తోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మొత్తానికి అనసూయ చేసిన ఈ తాజా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరో సరికొత్త యుద్ధానికి తెరలేపాయి.