
డొమెస్టిక్ LPG సిలిండర్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. గతంలో ఆగస్టు 23 నాటికి ఈకేవైసీ పూర్తి చేయటం మిస్ అయిన కస్టమర్లకు మరోసారి అవకాశం కల్పించింది. వివిధ కారణాల వల్ల గడువులోగా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (e-KYC) పూర్తి చేయలేకపోయిన వారికి ఆయిల్ కంపెనీలు ఆగస్టు 31 వరకూ అవకాశం కల్పించాయి.
ఆగస్టు 23తో ముగియాల్సిన ఎల్‌పీజీ ఈ-కేవైసీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించటంతో గ్యాస్ వినియోగదారులకు ఊరట లభించింది. తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 82% మంది వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేశారు. గడువు ముగిసే సమయానికి రోజుకు 20 వేల నుంచి 30 వేల మంది గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పోటెత్తడంతో గడువు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ALSO READ : పెళ్లి, పెత్తనంపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇక్కడ డొమెస్టిక్ యూజర్లు గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆగస్టు 31 తర్వాత కూడా గ్యాస్ సిలిండర్ల సరఫరా కొనసాగుతుంది. అయితే భవిష్యత్ ఇబ్బందులు తలెత్తకుండా వీలైనంత త్వరగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడం బెటర్ అని అధికారులు సూచిస్తున్నారు.