Reading Time: 2 minutes

రిషభ్ పంత్‌కు ఏమైంది? చేతికి స్లింగ్‌తో కనిపించిన స్టార్ వికెట్ కీపర్!

Caption of Image.

Rishabh Pant Injury: మైదానంలో ఎంత పెయిన్ ఉన్నా సరే.. తన స్మైల్‌తో బౌలర్లను కవ్విస్తూ బాదేసే మన ఫైర్ బ్రాండ్ రిషభ్ పంత్ ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో టెన్షన్ పుట్టిస్తోంది. కొలంబో టెస్టు మూడో రోజున పంత్ చేతికి స్లింగ్ (Sling) పట్టీ వేసుకుని డగౌట్‌లో సైలెంట్‌గా నిల్చున్న విజువల్స్ చూసి క్రికెట్ ఫ్యాన్స్‌ గుండెలాగినంత పనైంది. క్రీజులో ఉన్నంతసేపు లంక పేసర్లు వేసిన బౌన్సర్లు బాడీపై తగులుతున్నా లెక్కచేయకుండా హాఫ్ సెంచరీ కొట్టిన పంత్, ఇప్పుడు చేతికి పట్టీతో ప్రత్యక్షమవ్వడంతో అసలు గాయం ఎంత సీరియస్‌గా ఉందనే టెన్షన్ పీక్స్ చేరింది.

గాయంతోనే రఫ్ఫాడించిన పంత్: 

తొలి రోజే కేవలం 3 పరుగుల దగ్గర గాయపడి రిటైర్డ్ హర్టుగా పెవిలియన్ చేరిన రిషభ్ పంత్, రెండో రోజు ఆ నొప్పుతో పంటి బిగువున భరిస్తూ క్రీజులోకి అడుగు పెట్టాడు. లంక బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ 89 బంతుల్లో 63 పరుగులతో విరుచుకుపడ్డాడు. సెంచరీ హీరో ధ్రువ్ జురెల్‌తో కలిసి 7వ వికెట్‌కి 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, భారత్‌ను 503 పరుగుల వద్ద మ్యాచ్ డిక్లెర్ చేశారు. అయితే ఆ 63 రన్స్ వెనుక పంత్ ఎంతటి ఫిజికల్ పెయిన్ అనుభవించాడో మూడో రోజు డగౌట్ సీన్‌తో కళ్లకు కట్టినట్లు అర్థమైంది.

క్రీజులోకి కీపర్‌గా ధ్రువ్ జురెల్: 

శ్రీలంక ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పుడు పంత్ వికెట్ కీపింగ్‌కి రాలేకపోయాడు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ల వెనుక గ్లౌవ్స్ తొడుక్కుని బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. శరీరం, భుజంపై పడ్డ బలమైన దెబ్బలతో పంత్‌ను రిస్క్ తీసుకోనివ్వకుండా మెడికల్ టీమ్ కంప్లీట్ రెస్ట్ ఇచ్చేసింది. లంక బ్యాటర్ల వికెట్లు పడుతున్నా, మైదానం బయట పంత్ చేతికి పట్టీతో అలా సైలెంట్‌గా కూర్చోవడం మ్యాచ్ రిజల్ట్ కంటే పంత్ ఫిట్‌నెస్‌పైనే ఎక్కువ డిస్కషన్ నడిచేలా చేసింది.

భారత జట్టుకి బిగ్ షాక్: 

భారత జట్టు స్కోరు బోర్డుపై 503 పరుగులు కొట్టి మ్యాచ్‌పై పక్కా గ్రిప్ సాధించినా, మన మెయిన్ మ్యాచ్ విన్నర్ రిషభ్ పంత్ చేతికి పట్టీ పడడం టీమ్‌కి బిగ్ షాక్ అని చెప్పాలి.. ఈ గాయం తీవ్రత తక్కువే ఉండాలని, రిషభ్ త్వరలోనే కోలుకుని మళ్లీ హుషారుతో వికెట్ల వెనుక రచ్చ రచ్చ స్టార్ట్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.  
 

©️ VIL Media Pvt Ltd.