Reading Time: < 1 minute

85 ఏళ్ళ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు… 85 లక్షలు కాపాడిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో..

Caption of Image.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్ల ఆగడాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. తరచూ ఎక్కడో ఒక చోట అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు కేటుగాళ్లు. ఇప్పుడు హైదరాబాద్ లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. అయితే… తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి చెందిన రూ.85 లక్షలు సేవ్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

85 ఏళ్ళ ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ డ్రామా స్టార్ట్ చేశారు. NIA అధికారిగా నటించి వీడియో కాల్ లో బెదిరింపులకు పాల్పడ్డారు కేటుగాళ్లు. ఆధార్ దుర్వినియోగం, రూ.2.50 కోట్ల ఫ్రాడ్ కేసుతో సంబంధం ఉందంటూ భయపెట్టి… RBI వీరిఫికేషన్ పేరుతో రూ.85 లక్షలు బదిలీ చేయించాడు మోసగాడు.

మరో రూ. 42 లక్షలు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు NCRPకి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మనీ ట్రయిల్ ను ఫాలో చేసి కేసును ఛేదించారు. IDFC బ్యాంకు అకౌంట్ ను ఫ్రీజ్ చేసి బాధితుడు బదిలీ చేసిన మొత్తం రూ.85.20 లక్షలను కాపాడారు అధికారులు.

ALSO READ : లంచాలు సమానంగా పంచుకుందాం.. 

సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ లో బెదిరిస్తే ఏమాత్రం భయపడకుండా తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ అధికారులెవరూ కూడా వీడియో కాల్స్ లో బెదిరించరని స్పష్టం చేశారు. అనుమానిత నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దని సూచిస్తున్నారు. ఈజీ మనీ కోసం ఆన్ లైన్ లో వచ్చే లింక్స్ క్లిక్ చేసిమోసపోవద్దని సూచిస్తున్నారు అధికారులు.

©️ VIL Media Pvt Ltd.