Reading Time: 2 minutes
September Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..?

September Bank Holidays: ఇప్పుడు ఆగస్ట్‌ నెల ముగియబోతోంది. సెప్టెంబర్‌ నెల రానుంది. ప్రతి నెల రాగానే బ్యాంకు కస్టమర్లు ఆ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకు పనులు చేసుకునే వినియోగదారులు ముందు జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో పండలు, ఇతర కార్యక్రమాలను బట్టి బ్యాంకులకు సెలవులు ఉంటాయని గుర్తించుకోవాలి. సాధారణ ఆదివారం సెలవులతో పాటు సెప్టెంబర్‌లో రెండో, నాలుగో శనివారాల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు పనిచేయవు. సెప్టెంబర్ 12న రెండో శనివారం, అలాగే సెప్టెంబర్ 26న నాలుగో శనివారం కావడంతో ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు బ్రాంచ్‌లు మూసి ఉంటాయి.

ఇది కూడా చదవండి: Amazon, Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సెల్లర్ నిబంధనలు మార్పు.. ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా!

  1. సెప్టెంబర్ 4, శుక్రవారం: జన్మాష్టమి (వైష్ణవ) / కృష్ణ జయంతి సందర్భంగా అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గాంగ్‌టక్, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, విజయవాడ తదితర నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
  2. సెప్టెంబర్ 12, శనివారం: ఇది దేశవ్యాప్తంగా రెండో శనివారం కావడంతో అన్ని బ్యాంకు శాఖలకు సాధారణ సెలవు ఉంటుంది. అదనంగా, శ్రీమంత శంకరదేవుని తిరుభావ తిథి సందర్భంగా గౌహతిలో కూడా బ్యాంకులు మూసివేయబడతాయి.
  3. సెప్టెంబర్ 14, సోమవారం: గణేష్ చతుర్థి, గణేష్ పూజ, వరసిద్ధి వినాయక వ్రతం, హర్తాళిక వంటి పండుగల సందర్భంగా బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, విజయవాడ నగరాల్లో బ్యాంకు శాఖలకు సెలవు ఉంటుంది.
  4. సెప్టెంబర్ 15, మంగళవారం: సంవత్సరి (చతుర్థి పక్షం), నుఖాయ్, గణేష్ చతుర్థి రెండో రోజు సందర్భంగా అహ్మదాబాద్, భువనేశ్వర్, పనాజీ నగరాల్లో బ్యాంకులకు సెలవు.
  5. సెప్టెంబర్ 21, సోమవారం: శ్రీమంత శంకరదేవ / శ్రీ నారాయణ గురు సమాధి జన్మోత్సవం సందర్భంగా గౌహతి, కొచ్చి, తిరువనంతపురం నగరాల్లో బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి.
  6. సెప్టెంబర్ 22, మంగళవారం: కర్మ పూజ సందర్భంగా రాంచీలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  7. సెప్టెంబర్ 23, బుధవారం: మహారాజా హరి సింగ్ జీ జన్మదినం సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి.
  8. సెప్టెంబర్ 25, శుక్రవారం: ఇంద్రజాతర పండుగ సందర్భంగా గాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు.
  9. సెప్టెంబర్ 26న నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలకు సాధారణ సెలవు ఉంటుంది. అలాగే సెప్టెంబర్‌లో వచ్చే అన్ని ఆదివారాల్లో కూడా బ్యాంకు బ్రాంచ్‌లు సాధారణంగా మూసివేయబడతాయి.

ఇదిలా ఉంటే బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ ఖాతాదారులకు అందుబాటులో ఉండే డిజిటల్ సేవలకు సాధారణంగా అంతరాయం ఉండదు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, యూపీఐ చెల్లింపులు, ఏటీఎం సేవలు వంటి సదుపాయాలను వినియోగించుకోవచ్చు. అయితే నగదు డిపాజిట్, చెక్ సంబంధిత పనులు, ఖాతా సేవలు, రుణ సంబంధిత బ్రాంచ్ పనులు వంటి వాటికి శాఖను సందర్శించాల్సి ఉంటే సెలవు తేదీలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే పనులు పూర్తి చేసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: Personal Finance: జీతం పెరిగినప్పుడు చాలా మంది చేసే 5 ప్రధాన పొరపాట్లు ఏంటో తెలుసా..?

ఇది కూడా చదవండి: MG EV: సింగిల్‌ ఛార్జింగ్‌తో 550 కిలోమీటర్ల రేంజ్.. పవర్‌ఫుల్‌ 7 సీటర్‌ కారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి