
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సెషన్ లో సీనియర్ సభ్యుడైన కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కౌశిక్ రెడ్డి అనైతిక వ్యవహార శైలిపై గతంలో సభకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఈ క్రమంలో జులైలో ఎథిక్స్ కమిటీ పాడికౌశిక్ రెడ్డి వ్యవహారంపై సమావేశమైంది కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈ క్రమంలో ఎథిక్స్ కమిటీ ఆగస్టు 29న మరో సారి సమావేశం కానుంది. ఎథిక్స్ కమిటీ సమావేశానికి హాజరవుతానని కౌశిక్ రెడ్డి అన్నారు. ఎథిక్స్ కమిటీ సమావేశానికి హాజరుకావాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ కమిటీ విచారణ అనంతరం తీసుకునే నిర్ణయం, స్పీకర్ తీసుకోబోయే చర్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారాయి.
ALSO READ : కూతురు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు…
2026 మార్చి 29న తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని తుపాకీతో కాల్చి చంపుతానని పాడి కౌశిక్ రెడ్డి బెదిరించారు. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మండిపడింది. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసింది.