Reading Time: < 1 minute
Nivin Paulys Latest Blockbuster Bethlehemkudumbaunit Is Releasing In Telugu

‘ప్రేమలు’ దర్శకుడు గిరీష్ AD దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’. మమిత బైజు హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కేరళ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఓనమ్ కానుకగా మలయాళంలో విడుదలైన ఈ ఫీల్-గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.నివిన్ పౌలి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

రిలీజ్ అయిన మూడు రోజులలోనే రూ. 60 కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇంతటి సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సమాయత్తమయ్యారు. ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు హీరో నివిన్ పౌలీ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని భావనా స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఫ్యూచర్ రన్-అప్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాయి. ‘ప్రేమలు’ తరహాలోనే ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా తెలుగు ప్రేక్షకుల మనసులను తప్పకుండా గెలుచుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది. వాస్తవానికి మొదట తెలుగులో రీమేక్ చేయాలని భావించారు కానీ కథ అందులోని సెన్సబిలిటీస్ ఇక్కడ ఆడియెన్స్ కు అంతాగ సెట్ అవ్వవని భావించి రీమేక్ ఆలోచనను పక్కన పెట్టి డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు. మళయాళంలో రికార్డులు క్రియేట్ చేసిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ తెలుగులో ఎలాంటి వసూళ్లు తెస్తుందో చూడాలి.