Reading Time: 2 minutes

RashmikaVijay: గాయం తర్వాత తొలిసారి బయటకొచ్చిన రష్మిక.. విజయ్ కేరింగ్‌పై నెటిజన్లు ఫిదా!

Caption of Image.

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ‘మైసా’ షూటింగ్‌లో గాయపడిన తర్వాత ఆమె తొలిసారిగా ఓ పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించింది. హైదరాబాద్‌లో జరిగిన ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి కుమారుడు సహిల్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు తన భర్త, టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి  రష్మిక హాజరైంది. ఈ సందర్భంగా ఇద్దరూ చేతులు పట్టుకుని కలిసి నడుస్తూ కనిపించడంతో అభిమానుల దృష్టి మొత్తం వారిపైనే పడింది.

ఫస్ట్‌ అప్పియరెన్స్ ..

బ్లాక్ అండ్ గోల్డ్ లెహెంగాలో రష్మిక సంప్రదాయ లుక్‌లో మెరిసిపోగా.. విజయ్ పూర్తిగా బ్లాక్ సూట్‌లో స్టైలిష్‌గా కనిపించాడు. అయితే వీరి లుక్ కంటే రష్మికను విజయ్ జాగ్రత్తగా వెంట తీసుకెళ్లిన తీరు అభిమానులను మరింత ఆకట్టుకుంది. గాయం తర్వాత రష్మిక ఇలా బయటకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.

‘మైసా’ షూటింగ్‌లో గాయం..

‘మైసా’ షూటింగ్‌లో ఓ ఇంటెన్స్ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో రష్మిక కుడి తుంటికి గాయమైంది. వరుసగా మూడోసారి గాయపడినట్లు స్వయంగా వెల్లడించిన ఆమె.. ఈసారి శరీరాన్ని మెషీన్‌లా కాకుండా మనిషిలా చూసుకోవాల్సిన సమయం వచ్చిందని సరదాగా చెప్పింది. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసా’లో రష్మిక గోండు తెగకు చెందిన మహిళగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. భారీ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఆమె డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నట్లు సమాచారం.

ఇక రష్మిక–విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రాయలసీమ నేపథ్యంలో సాగనుంది. 1854–1878 మధ్య బ్రిటిష్ పాలన కాలానికి సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ‘మైసా’తో పాటు ‘రణబాలి’పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో.. రష్మిక పూర్తిగా కోలుకుని ఎప్పుడు షూటింగ్‌లోకి రీఎంట్రీ ఇస్తుందా? అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.

 

©️ VIL Media Pvt Ltd.