Reading Time: < 1 minute

Canada vs US:అమెరికా, కెనడా మధ్య బిజినెస్ వార్..700 అమెరికా ఉత్పత్తులపై కెనడా భారీ సుంకాలు

Caption of Image.

అమెరికా, కెనడా మధ్య వాణిజ్య యుద్దం ముదురుతున్నది. అమెరికాకు చెందిన ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను పెంచింది కెనడా. ఇండస్ట్రియల్ గూడ్స్ నుంచి నిత్యావసర వస్తువుల వరకు  700 వస్తువులపై టారీఫ్ లు విధించింది. సీఫుడ్, చీజ్, క్లాత్స్, కాస్మోటిక్స్, టాయిలెట్ పేపర్ల కొనుగోళ్లపై ఈ సుంకాలు తీవ్రప్రభావం చూపనున్నాయి. వాణజ్యపరమైన చర్చలు విఫలం కావడంతో  ఇటీవల కెనడా వస్తువులపై 50 శాతం సుంకాలు విధించడంతో అమెరికాపై సుంకాల ప్రతీకారం తీర్చుకుంది.

సుంకాలపై కెనడా ప్రధాని మార్క్ కెర్నీ అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. కెనడాను లొంగదీసుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చర్చల సమయంలో అమెరికా డిమాండ్లు కెనడా పరిశ్రమలను  నాశనం చేసేలా ఉన్నాయని కార్నీ అన్నారు. 

సోమవారం చర్చల అనంతరం  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెనడాకు టారీఫ్  బెదిరింపులకు దిగారు. మాతో కలిస్తే సరి.. లేదంటే మరిన్ని సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. కెనడాకు చెందిన ఆటోమొబైల్, ఉక్కుపై  కొత్తగా 50 శాతం  సుంకాలు విధించడంతో  అమెరికా, కెనడా వాణిజ్య యుద్దం మరింత తీవ్రమైంది. 

©️ VIL Media Pvt Ltd.